ETV Bharat / city

Good Friday: 'శత్రువులను కూడా ప్రేమతో క్షమించాలన్న దయామయుడు ఏసుక్రీస్తు'

VIPS Good Friday wishes: గుడ్​ఫ్రైడే సందర్బంగా ఏసుక్రీస్తు త్యాగాన్ని ప్రతి ఒక్కరూ స్మరించుకున్నారు. కరుణామయుడైన ఏసు ప్రభువును శిలువ వేసిన రోజు గుడ్ ఫ్రైడే అయితే.. ఆ తరువాత ఏసు పునరుజ్జీవించిన ఆదివారం రోజు ఈస్టర్ అని సీఎం జగన్​ గుర్తుచేశారు. జీసెస్‌ మహాత్యాగానికి ప్రతీక గుడ్‌ఫ్రైడే అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.

VIPS Good Friday wishes
గుడ్ ఫ్రైడే పలువురు ప్రముఖుల శుభాకాంక్షలు
author img

By

Published : Apr 15, 2022, 1:22 PM IST

Updated : Apr 15, 2022, 1:34 PM IST

VIPS Good Friday wishes: గుడ్ ప్రైడే సందర్భంగా ప్రజలకు సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. కరుణామయుడైన ఏసు ప్రభువును శిలువ వేసిన రోజు గుడ్ ఫ్రైడే అయితే.. ఆ తరువాత ఏసు పునరుజ్జీవించిన.. ఆదివారం రోజు ఈస్టర్ అని గుర్తుచేశారు. ఈ రెండూ మానవాళి చరిత్రను మలుపులు తిప్పిన ఘట్టాలని కొనియాడారు. శత్రువుల పట్ల క్షమ‌, ఆకాశమంతటి సహనం, అవధులు లేని త్యాగం.. ఇవి జీసస్ తన జీవితం ద్వారా మానవాళికి ఇచ్చిన గొప్ప సందేశాలని అన్నారు.

  • శత్రువుల‌ను కూడా ప్రేమ‌తో క్ష‌మించాల‌ని చెప్పిన ద‌యామ‌యుడు ఏసుక్రీస్తు.
    జీస‌స్ మ‌హాత్యాగానికి ప్రతీక గుడ్ ఫ్రైడే. సాటివారి ప‌ట్ల ప్రేమ‌, అవ‌ధులు లేని త్యాగం.. ఇదే జీస‌స్ జీవితం మాన‌వాళికి ఇచ్చిన సందేశం.

    — YS Jagan Mohan Reddy (@ysjagan) April 15, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

VIPS Good Friday wishes: శత్రువులను కూడా ప్రేమతో క్షమించాలని చెప్పిన దయామయుడు ఏసుక్రీస్తు అని... ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అన్నారు. జీసెస్‌ మహాత్యాగానికి ప్రతీక గుడ్‌ఫ్రైడే అంటూ ట్వీట్ చేశారు. సాటివారి పట్ల ప్రేమ, అవధులు లేని త్యాగం... మానవాళికి క్రీస్తు సందేశం ఇదేనని అన్నారు.

  • శిలువపై ఉన్న చివరి క్షణాల్లో కూడా శత్రువును క్షమించి తన ప్రేమ తత్వాన్ని చాటిన ఏసుక్రీస్తు జీవితం ఒక అద్భుతం. మనుషుల మధ్య సామరస్యం ఉండాలని, సాటివారికి నిస్వార్థంతో సేవ చేయాలనే క్రీస్తు బోధన మనందరికీ ఆచరణీయం. #GoodFriday సందర్భంగా ఏసు చూపిన మార్గంలో నడిచేందుకు సంకల్పిద్దాం

    — Lokesh Nara (@naralokesh) April 15, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

VIPS Good Friday wishes: గుడ్ ఫ్రైడే సందర్భంగా తెదేపా అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్​ ఏసుక్రీస్తు త్యాగాన్ని స్మరించుకుందామన్నారు. శిలువపై ఉన్న చివరి క్షణాల్లో కూడా శత్రువును క్షమించి తన ప్రేమ తత్వాన్ని చాటిన ఏసుక్రీస్తు జీవితం ఒక అద్భుతమని తెలిపారు. మనుషుల మధ్య సామరస్యం ఉండాలని, సాటివారికి నిస్వార్థంతో సేవ చేయాలనే క్రీస్తు బోధన మనందరికీ ఆచరణీయమని పేర్కొన్నారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా ఏసు చూపిన మార్గంలో నడిచేందుకు సంకల్పిద్దామని పిలుపునిచ్చారు. మనుషుల్లో ప్రేమతత్వాన్ని నింపడం కోసం, సమాజంలో శాంతి స్థాపనకు తన జీవితాన్ని అంకితం చేసిన దేవుడు ఏసుక్రీస్తు అని వెల్లడించారు. ఆ ప్రయత్నంలో క్రీస్తు తన ప్రాణాలను కూడా త్యాగం చేశారని అన్నారు. ఇతరుల కోసం జీవించే జన్మ చరితార్థమని నిరూపించిన త్యాగధనుడు... ఏసుక్రీస్తు బోధనలు ఆదర్శమన్నారు.

ఇదీ చదవండి: Lottery: సిక్కోలు గడ్డపై నయా మోసం.. జీవితాలను ముంచేస్తున్న "లాటరీ వల"

Last Updated : Apr 15, 2022, 1:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.