గ్రామ, వార్డు సెక్రటరీలు, వాలంటీర్ల శాఖ బాధ్యతలు ఇద్దరు మంత్రులకు అప్పగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గ్రామ సెక్రటరీలు, వాలంటీర్ల బాధ్యతలను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, వార్డు సెక్రటరీలు, వాలంటీర్ల బాధ్యతలను మంత్రి బొత్స సత్యనారాయణకు కేటాయించారు. బాధ్యతలు కేటాయింపుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని నోటిఫికేషన్ జారీ చేశారు.
ఇదీ చదవండి : వైద్య వ్యవస్థలో పూర్తిస్థాయి ప్రక్షాళనకు చర్యలు : మంత్రి ఆళ్ల నాని