ETV Bharat / city

సచివాలయాల పోస్టులకు దరఖాస్తు గడువు పొడగింపు

గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగాల కోసం దరఖాస్తుల గడువును రాష్ట్ర ప్రభుత్వం మరో రోజు పెంచింది. పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల్లో వరద పరిస్థితుల రీత్యా ఈ సమయాన్ని మరో రోజుకు పెంచుతూ ఆదేశాలు జారీ అయ్యాయి.

సచివాలయాల పోస్టులకు దరఖాస్తు గడువు పొడగింపు
author img

By

Published : Aug 11, 2019, 5:36 AM IST

గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రోజు గడువు పొడిగించింది. తొలుత నోటిఫికేషన్ లో పేర్కొన్న ప్రకారం శనివారం రాత్రి 11:50గంటలతో గడువు ముగియనుండగా... దాన్ని ఈరోజు రాత్రి 11:50వరకూ పొడిగిస్తున్నట్లు పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్ ప్రకటించారు. వరద పరిస్థితుల దృష్ట్యా గడువు పొడిగించాలని కోరుతూ అభ్యర్థుల నుంచి వచ్చిన వినతులపై సీఎం జగన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

కేటిగిరి-1కు ఎక్కువ పోటీ...

శనివారం రాత్రి 8:30 గంటల సమయానికి మొత్తంగా 21 లక్షల 64వేల 490 మంది అభ్యర్థులు ధరఖాస్తు చేసుకున్నారు. కేటగిరి-1కి 12లక్షల 36వేల 277, కేటగిరి-2(A)కి లక్షా34వేల371, కేటగిరి-2(B)కి లక్షా 63వేల744 కేటగిరి-3కి 6లక్షల30వేల098 ధరఖాస్తులు వచ్చాయి. శనివారం ఒక్క రోజే 120300 దరఖాస్తులొచ్చాయి. ఇక మరో రోజు గడువు ఇవ్వటంతో ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశముందని ప్రభుత్వం భావిస్తోంది.

వాయిదాకు డిమాండ్

గ్రామ సచివాలయాల్లోని వివిధ పోస్టుల నియామక పరీక్షలను వాయిదా నెలరోజుల పాటు వాయిదా వేయాలని రాష్ట్ర నిరుద్యోగ ఐకాస డిమాండ్ చేసింది.

సచివాలయాల పోస్టులకు దరఖాస్తు గడువు పొడగింపు

ఇవీ చూడండి-150 ఏళ్ల మహా వృక్షం..కాపాడుతున్న దాతలు

Intro:AP_RJY_62_10_220 KGS_GANJA_CAUGHT_BY POLICE_AV_AP10022Body:అక్రమంగా తరలిస్తున్న 220 కేజీ ల గంజాయిని ప్రత్తిపాడు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు... రెండు రోజులుగా తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు(మండలం) జాతీయ రహదారిపై ఒక హోటల్ వద్ద లారీ నిలిచి ఉంది... లారీ నుండి గంజాయి వాసన వస్తుంది అన్న సమాచారం మేరకు తహశీల్దార్ నాగమల్లేశ్వరవు సమక్షంలో సీ ఐ సన్యాసిరావు లు లారీ ని స్వాధీనం చేసుకున్నారు...వంతాడా andru minerals నుండి మైనింగ్ తరలిస్తున్న ఆ లారీ లో 110 గంజాయి ప్యాకెట్లను గుర్తించారు.. వాటిని రెవెన్యూ అధికారులు సమక్షంలో తూయగా 220 కేజీలు ఉన్నట్లు గుర్తించారు... గంజాయి విలువ నాలుగు లక్షల నలభై వేలు ఉంటుంది అని అంచనా వేశారు... త్వరలోనే సంబంధిత వ్యక్తులు ను అదుపులోకి తీసుకొంటామని పోలీసులు తెలిపారు.. ఈ కార్యక్రమంలో ఎస్ ఐ రవికుమార్ సీ ఐ సన్యాసిరావు తహసీల్దార్ నగమల్లేశ్వరవు లు పాల్గొన్నారు...Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.