సదావర్తి సత్రం భూముల వేలం వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఈ భూముల వేలంలో అక్రమాలు జరిగాయని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం... విచారణకు ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్‌సింగ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ భూముల వేలానికి సంబంధించిన అన్ని రికార్డులను తక్షణమే విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు అందజేయాల్సిందిగా రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్‌ను ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చెన్నై నగర సమీపంలోని 83.11 ఎకరాల భూముల వేలం వ్యవహారంలో అక్రమాలు జరిగినట్టు ప్రభుత్వం గుర్తించిందని... ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపిస్తామని గతంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రకటించారు.
ఇదీ చదవండీ... అక్టోబరు 10 నుంచి...వైఎస్ఆర్ కంటి వెలుగు