రొమ్ము సంబంధ సమస్యలపై(breast cancer) హెల్ప్‌లైన్ హర్షణీయమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. హైదరాబాద్‌లో ఉషాలక్ష్మీ బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ హెల్ప్‌ను (Ushalakshmi Breast Cancer Foundation Help) ఆయన వర్చువల్ ప్రారంభించారు. 12 భాషల్లో హెల్ప్‌లైన్ నిర్వహణ హర్షణీయమని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.
క్యాన్సర్ చికిత్సలో కౌన్సెలింగ్ కీలకపాత్ర అని.. బ్రెస్ట్ క్యాన్సర్ విజేతలు అవగాహన కల్పించడం సంతోషకరమని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. క్యాన్సర్ విజేతల మాటలు బాధితులకు భరోసానిస్తాయని వెల్లడించారు. క్యాన్సర్వల్ల రోగుల కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయని... క్యాన్సర్ చికిత్సల వ్యయాన్ని తగ్గించాలని అభిప్రాయపడ్డారు. రొమ్ము సంబంధ సమస్యలను క్యాన్సర్‌గా భావించవద్దని సూచించారు. ప్రజారోగ్య వ్యవస్థలో ఆయుష్మాన్ భారత్ చరిత్రాత్మక మార్పునకు నాంది పలుకుతుందని తెలిపారు. పథకంలో అర్హులందరూ పేర్లు నమోదు చేసుకోవాలని వెంకయ్యనాయుడు సూచించారు.
ఇదీ చూడండి: Thotlakonda : తొట్లకొండ పరిరక్షణకు సీఎం ఇచ్చిన హామీలు నెరవేర్చాలి