ETV Bharat / city

'మహిళల జీవితాలతో సీఎం జగన్ పబ్జీ ఆడుతున్నారు'

ముఖ్యమంత్రి జగన్​కు పాలన చేతకాదని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత విమర్శించారు. మద్యం దుకాణాల వద్ద జనం బారులతో కరోనా వైరస్ వ్యాప్తి పెరిగితే ఏం చేస్తారని ప్రశ్నించారు. ప్రజల జీవితాలతో సీఎం చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు.

vangalapudi anitha criticises cm jagan
వంగలపూడి అనిత
author img

By

Published : May 4, 2020, 6:54 PM IST

ప్రజల జీవితాలతో సీఎం జగన్ చెలగాటమాడుతున్నారని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ధ్వజమెత్తారు. జే ట్యాక్స్ కోసమే మద్యం షాపులు తెరిచారని దుయ్యబట్టారు. మద్యం దుకాణాల దగ్గర జనం బారులు చూస్తే భయమేస్తోందన్న ఆమె.. కరోనా వైరస్ వ్యాప్తి పెరిగితే ఏం చేస్తారని నిలదీశారు. అక్క చెల్లెళ్లను ఆదుకోవడమంటే ఇదేనేమో అని ఎద్దేవా చేశారు.

మహిళల జీవితాలతో జగన్ పబ్జీ గేమ్ ఆడుతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రికి పాలన చేతకాదు సరే సలహాదారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి మానసిక స్థితి సరిగా లేదన్న అనిత.. మహిళలకు ముఖ్యమంత్రి తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి.. మద్యం దుకాణాల వద్ద రద్దీపై పీఎంవో ఆరా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.