తాను ఇచ్చిన ఫిర్యాదుపై గన్నవరం పోలీసులు స్పందించటం లేదని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ హైకోర్టును ఆశ్రయించారు. సామాజిక మాధ్యమాల్లో తనపై అసభ్యకర పోస్టులు, బెదిరింపులు, ప్రతిష్టకు భంగం కలిగించే చర్యలపై గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. వంశీ పిటిషన్ను స్వీకరించిన ఉన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. వంశీ తరుఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ... తాము ఇచ్చిన ఫిర్యాదు పై గన్నవరం పోలీసులు కేసు నమోదు చేయలేదన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వులో ఉంచింది.
ఇదీ చదవండి: