ముఖ్యమంత్రి జగన్‌ను అమెరికా కాన్సుల్ జనరల్(హైదరాబాద్) జోయల్ రీఫ్‌మెన్ మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రితో ఆయన భేటీ అయ్యారు. అమెరికా – ఆంధ్ర సంబంధాలు మెరుగుదలపై చర్చించారు. అమెరికా కాన్సులేట్‌కు సీఎం అందించిన సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. విద్యావిధానంలో సంస్కరణలు, కొవిడ్ కట్టడి చర్యలను కాన్సులేట్ జనరల్ అభినందించారని... ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ప్రశంసించారని పేర్కొంది. ఆంధ్రలో అమెరికా పెట్టుబడులు మరింత మెరుగుపడతాయని ఆకాంక్షించినట్లు వెల్లడించింది. దేశంలోని గొప్ప నగరాల్లో ఒకటిగా రూపొందేందుకు విశాఖపట్నానికి అద్భుత అవకాశాలు ఉన్నాయని అన్నట్లు ప్రభుత్వం వివరించింది.
ఇవీ చదవండి: