FLEXI ISSUE: అమరావతి ప్రాంతంలో కృష్ణానది కరకట్ట విస్తరణ పనులకు రైతుల నుంచి తీవ్ర అభ్యంతరాలు ఎదురవుతున్నాయి. వారం క్రితం పనులు చేయడానికి వచ్చిన సీఆర్డీఏ సిబ్బంది, నిర్మాణ సంస్థ ప్రతినిధులను రైతులు అడ్డుకున్నారు. తమ అనుమతి లేకుండా పొలాల్లోకి ఎలా వస్తారని నిర్మాణ సంస్థ సిబ్బందిని నిలదీసిన రైతులు.. తాజాగా నష్టపరిహారం చెల్లించకుండా తమ భూముల్లోకి రావడానికి వీలు లేదంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పనులను ప్రారంభిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తేల్చిచెప్పారు. దీంతో సీఆర్డీఏ అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు పనులు చేయకుండానే వెనుదిరిగారు.
కృష్ణా కరకట్టపై రైతులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. కరకట్ట విస్తరణలో భాగంగా తమ పొలాలు కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సెంటుకి 5 లక్షల రూపాయల పరిహారం ఇచ్చిన తర్వాతే తమ భూముల్లోకి అడుగుపెట్టాలని సీఆర్డీఏ అధికారులకు తేల్చిచెప్పారు. బలవంతంగా తమ భూముల్లోకి అడుగుపెడితే తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు.
ఇవీ చదవండి: