తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. సంక్రాంతి సెలవులు రావడం వల్ల హైదరాబాద్ నుంచి సొంత గ్రామాలకు వెళ్లే వాహనాల సంఖ్య పెరగడమే ఇందుకు కారణం. ఫాస్ట్ టాగ్ ఉన్నప్పటికీ గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టోల్‌ప్లాజా వద్దే దాదాపు అరగంట సమయం పడుతోందని వాపోతున్నారు. ఆదివారం ట్రాఫిక్ మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.
ఇవీ చూడండి: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది సజీవదహనం