ETV Bharat / city

L RAMANA: కేటీఆర్​ సమక్షంలో నేడు గులాబీ గూటికి ఎల్​. రమణ

తెలుగుదేశం తెలంగాణ మాజీ అధ్యక్షుడు ఎల్​.రమణ... నేడు తెరాస గూటికి చేరనున్నారు. పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ చేతుల మీదుగా తెరాస ప్రాథమిక సభ్యత్వం తీసుకుంటారు. నాలుగు రోజుల క్రితమే రమణ.. తెదేపాను వీడారు.

Ramana_Joins_Trs
Ramana_Joins_Trs
author img

By

Published : Jul 12, 2021, 7:04 AM IST

తెదేపా తెలంగాణ మాజీ అధ్యక్షుడు ఎల్​.రమణ నేడు తెరాసలో చేరనున్నారు. తెలంగాణ భవన్​లో ఆ పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ సమక్షంలో గులాబీ కండువా కప్పుకుంటారు. కేటీఆర్​ చేతుల మీదుగా రమణ.. తెరాస ప్రాథమిక సభ్యత్వం తీసుకుంటారు. త్వరలో రమణ అనుచరులు కేసీఆర్​ సమక్షంలో భారీగా చేరేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

తెరాసలోకి ఎల్. రమణ చేరికపై కొంత కాలంగా చర్చలు జరిగాయి. ఈ నెల 8న మంత్రి ఎర్రబెల్లి దయాకరరావుతో కలిసి ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్​ను ప్రగతిభవన్​లో కలిశారు. తెరాసలో చేరిక, పార్టీలో బాధ్యతలు, రాజకీయ భవిష్యత్‌పై చర్చించారు. నాలుగు రోజుల క్రితం రాష్ట్ర తెదేపా అధ్యక్ష పదవికి ఎల్​. రమణ రాజీనామా చేశారు.

ఎల్.రమణకు త్వరలో ఎమ్మెల్సీ పదవితో పాటు భవిష్యత్తులో పార్టీ, ప్రభుత్వంలో క్రియాశీలక అవకాశాలు ఇస్తామని కేసీఆర్​ హామీ ఇచ్చినట్లు సమాచారం. హుజూరాబాద్ ఉప ఎన్నికలు, ఈటల రాజేందర్ పరిణామాల నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బలమైన బీసీ నేత కోసం చూస్తున్న తెరాస.. ఎల్.రమణను పార్టీలోకి ఆహ్వానించింది.

ఆవిర్భావం నుంచి తెదేపాలోనే

ఎల్​.రమణ తెలుగుదేశం సీనియర్‌ నేత. పార్టీ ఆవిర్భావం నుంచి అందులోనే ఉన్నారు. 1994లో జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి, 1996లో కరీంనగర్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత పలు ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2009 శాసనసభ ఎన్నికల్లో జగిత్యాల నుంచి విజయం సాధించారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత తెతెదేపా అధ్యక్షునిగా రమణ పనిచేశారు.

ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రమణ పోటీ చేసి డిపాజిట్‌ కోల్పోయారు. 2018లోనే ఆయన తెరాసలో చేరి జగిత్యాల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరిగినా.. పరిస్థితులు అనుకూలించలేదు.

ఇవీచూడండి: Sirisha bandla: శిరీష రోదసీ కల నెరవేరిందిలా...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.