గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి జగన్ను తితిదే ఛైర్మర్ వైవీ సుబ్బారెడ్డి కలిశారు. తిరుమల తిరుపతి దేవస్థానం నేతృత్వంలో అమరావతిలో నూతనంగా నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానం ప్రారంభోత్సవానికి హాజరు కావాలని ఆహ్వానపత్రాన్ని అందజేశారు. అనంతరం ఇరువురికి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
ఈ నెల 4వ తేదీ నుంచి అమరావతిలో నూతనంగా నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామి వారి విగ్రహ ప్రతిష్ఠకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. 9న విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ, మహా సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తితిదే ఛైర్మన్ తెలిపారు.
ఇదీ చదవండి: జగన్ కీలక నిర్ణయం.. వైకాపా నుంచి కొత్తపల్లి సుబ్బారాయుడు సస్పెన్షన్