ETV Bharat / city

'మేం ఎంత బుజ్జగించినా... జేఏసీ నేతలు పట్టు వీడలేదు' - ఆర్టీసీ సమ్మె వార్తలు

టీఎస్‌ఆర్టీసీ ఐకాస నేతలను తాము ఎంత బుజ్జగించినా పట్టు వీడలేదని తెలంగాణ అధికారులు వెల్లడించారు. ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకే 21 అంశాలపై చర్చిద్దామని కోరినట్లు తెలిపారు. కార్మికులతో మాట్లాడి వస్తామన్న నేతలు... ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదన్నారు. జేఏసీ నాయకులు వస్తే... మళ్లీ చర్చించేందుకు ఎదురుచూశామని అధికారులు తెలిపారు.

'మేం ఎంత బుజ్జగించినా... జేఏసీ నేతలు పట్టు వీడలేదు'
author img

By

Published : Oct 27, 2019, 12:06 AM IST

తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకే ఆర్టీసీ జేఏసీ నేతలను 21 అంశాలపై చర్చించాలని కోరినట్లు తెలంగాణ ఆర్టీసీ ఇంఛార్జ్​ ఎండీ సునీల్​ శర్మ స్పష్టం చేశారు. హైదరాబాద్​ ఎర్రమంజిల్​ ఈఎన్​సీ కార్యాలయంలో జేఏసీ నేతలతో జరిగిన చర్చలపై అధికారులు స్పందించారు. సమావేశానికి ఎలాంటి భంగం కలగకూడదనే భావనతోనే చరవాణులు అనుమతించలేదని సునీల్​ శర్మ తెలిపారు. 21 అంశాలపై చర్చించాలని సుమారు గంటన్నర పాటు బుజ్జగించామని... అయినా నేతలు తమ పట్టు వీడలేదని అధికారులు తెలిపారు. కార్మికులతో మాట్లాడి వస్తామని వెళ్లిన నేతలు మళ్లీ వస్తారని చాలాసేపు ఎదురుచూశామని... అయినా రాలేదని తెలిపారు.

సమావేశం వివరాలు వెల్లడిస్తున్న సునీల్‌ శర్మ

ఇవీ చూడండి: నవంబర్ 1 నుంచి గ్రామ, వార్డు వాలంటీర్ల నియామకాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.