తెలంగాణలో అధికార పార్టీ ఎమ్మెల్యేకు కేంద్ర హోం శాఖ షాక్ ఇచ్చింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శాసనసభ్యుడు చెన్నమనేని రమేష్ పౌరసత్వం కోల్పోయినట్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన భారత పౌరుడు కాదని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇతర దేశాల్లో ఉన్న రమేష్.. రాజకీయాల కోసం స్వదేశానికి తిరిగివచ్చారు. వేములవాడ నుంచి గతంలోనూ శాసనసభ్యుడిగా గెలిచారు. నాటి నుంచే ఆయన పౌరసత్వంపై తెరాస ప్రత్యర్థి పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. ఈ విషయం న్యాయవివాదంగా మారింది. ఇప్పుడు.. ఆయనకు భారత పౌరసత్వం లేదంటూ కేంద్ర హెం శాఖ ఉత్తర్వులు ఇవ్వడం.. తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
తెరాస ఎమ్మెల్యేకు కేంద్ర హోం శాఖ షాక్.. పౌరసత్వం రద్దు - undefined
చెన్నమనేని రమేశ్ భారత్ పౌరుడు కాదని కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.