ETV Bharat / city

మూడుచింతలపల్లిలో తెరాస, కాంగ్రెస్ పోటాపోటీ ఫ్లెక్సీలు

author img

By

Published : Aug 24, 2021, 4:15 PM IST

తెలంగాణలోని మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లిలో తెరాస, కాంగ్రెస్ పార్టీలు... పోటాపోటీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసాయి. సీఎం కేసీఆర్ దత్తత గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనుల విలువతో కూడిన పూర్తి వివరాలను వారు పొందుపరచగా.. దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్ష చేయబోతున్నట్లుగా కాంగ్రెస్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది.

మూడుచింతలపల్లిలో తెరాస, కాంగ్రెస్ పార్టీల పోటాపోటీ ఫ్లెక్సీలు

తెలంగాణలోని మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్ష ప్రారంభమైంది. దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా కార్యక్రమాల్లో భాగంగా దీన్ని నిర్వహిస్తున్నారు. కాగా, తెరాస నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. తెరాస ఫ్లెక్సీల్లో కేసీఆర్ దత్తత గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనుల విలువతో కూడిన పూర్తి వివరాలను పొందుపరిచారు. కాంగ్రెస్ పార్టీ, తెరాస పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో ఎటువంటి ఘర్షణలు జరగకుండా పోలీసులు ముందస్తు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఆగస్టు 9 నుంచి సెప్టెంబరు 17 వరకు నిర్వహించతలపెట్టిన దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా కార్యక్రమాల్లో భాగంగా ఇప్పటికే ఇంద్రవెల్లి, రావిర్యాలలో బహిరంగ సభలు నిర్వహించగా ఇది మొదటి దీక్షా కార్యక్రమం. మూడుచింతలపల్లి సీఎం కేసీఆర్‌ దత్తత గ్రామం కావడంతో పీసీసీ ఈ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ గ్రామంలో ఎలాంటి అభివృద్ది జరగలేదని తెలంగాణ సమాజానికి తెలియజేయడానికే ఇక్కడ రెండు రోజుల దీక్షకు నిర్ణయించినట్లు రేవంత్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించారు.

ఇదీ చూడండి: KRMB: ఈ నెల 27న జరగాల్సిన కేఆర్ఎంబీ భేటీ వాయిదా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.