ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నైపుణ్యాభివృద్ది శిక్షణలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన ఉపాధ్యాయులను రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ సన్మానించింది. తాడేపల్లిలోని కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఏపీఎస్ఎస్డీసీ ఛైర్మన్ చల్లా మధు సూధన రెడ్డి ఏఆర్సీ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు - 2020 అవార్డు ప్రధానం చేశారు. ఎలక్ట్రానిక్స్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా , సీఈఓ ఎన్కె మహాపాత్ర పాల్గొన్నారు.
ఇండోయూరో సింక్రనైజేషన్ యాజమాన్యంతో రోబోటిక్ టక్నాలజీ ని ప్రవేశపెట్టి ఏపీఎస్ఎస్డీసీ, జర్మనీ సంయక్తంగా శిక్షణా కార్యక్రమాన్ని చేపట్టినట్లు మధు సూధన రెడ్డి తెలిపారు. 70 మంది ఫ్యాకల్టీకి జర్మనీలో ట్రైనింగ్ ఇప్పించామని...వారంతా శిక్షణ అనంతరం తిరిగి వచ్చి 1600 మందికి శిక్షణ ఇచ్చారని వీరి ద్వారా శిక్షణ పొందిన అభ్యర్థులంతా మంచి వేతనంతో ఉద్యోగాలు చేస్తున్నారని చల్లా మధుసూధనరెడ్డి తెలిపారు. బెస్ట్ ఫ్యాకల్టీ కింద రాష్ట్రంలో 3కళాశాలు ఎంపిక చేసి అవార్డులు ఇచ్చినట్లు తెలిపారు. భవిష్యత్తులోనూ ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపడతామన్నారు.
ఇదీ చదవండి: నేర్పాలంటే... నేర్చుకోవాల్సిందే!