Transfer exemption for employees union leaders: రాష్ట్రంలో గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల కార్యవర్గ సభ్యులకు బదిలీల నుంచి మినహాయింపును.. 9ఏళ్లకు పెంచుతూ సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి అరుణ్‌కుమార్ మెమో విడుదల చేశారు. 9ఏళ్లు ఒకే చోట సర్వీసు పూర్తి చేసుకున్న వారినే బదిలీ చేయాలని సూచించారు. ఇప్పటి వరకు 6 సంవత్సరాల వరకు మినహాయింపు ఉండగా.. దీన్ని 9ఏళ్లకు పెంచారు. రాష్ట్ర, జిల్లా, డివిజన్, తాలూకా స్థాయిల్లోని కార్యవర్గాలకు ఈ మినహాయింపు వర్తిస్తుంది.
9ఏళ్లు బదిలీల నుంచి మినహాయింపు ఇవ్వడం వల్ల సాధారణ ఉద్యోగులకు మంచి పోస్టింగ్‌లు లభించవని ఉద్యోగులు పేర్కొంటున్నారు. గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలు 103 వరకు ఉన్నాయి. ఈ సంఘాల్లోని కార్యవర్గ సభ్యులు దాదాపు 2వేల మందికి బదిలీల నుంచి మినహాయింపు లభిస్తుందని చెబుతున్నారు.
ఇవీ చూడండి: