ETV Bharat / city

మెట్ల పైనుంచి కిందపడి కుమారుడు.. గుండెపోటుతో తండ్రి - నారాయణపేట నేర వార్తలు

ఒకే కుటుంబంలో కుమారుడు, తండ్రి మరణించిన ఘటన తెలంగాణలోని నారాయణపేట జిల్లా మక్తల్​లో చోటు చేసుకుంది. ఇద్దరి మరణంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

tragic-incident-in-maktal
తెలంగాణలో దారుణం
author img

By

Published : Oct 4, 2020, 11:15 AM IST

మెట్ల పైనుంచి దిగుతూ కాలుజారి కిందపడి ఓ యువకుడు మృతి చెందిన ఘటన తెలంగాణలోని నారాయణపేట జిల్లా మక్తల్​లో చోటు చేసుకుంది. కుమారుడి మరణవార్త జీర్ణించుకోలేక తండ్రి గుండెపోటుతో చనిపోయారు. మక్తల్ వినాయక్ నగర్​లో జావిద్.. ఇంటి మేడపై చరవాణిలో ఆన్​లైన్ క్లాసులు విని మెట్ల పైనుంచి కిందికి దిగుతుండగా కాలుజారి కింద పడ్డాడు.

తలకు బలమైన గాయం తగలగా.. చికిత్స నిమిత్తం మహబూబ్​నగర్​లోని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. ఇంటి దగ్గర ఉన్న తండ్రి అన్వర్... కొడుకు మరణ వార్త విని గుండెపోటుతో అక్కడికక్కడే మరణించారు. కుటుంబంలో ఇద్దరు చనిపోగా.. విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇదీ చదవండి : నేడు సివిల్​ సర్వీసెస్​ ప్రాథమిక పరీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.