ETV Bharat / city

Revanth Reddy House Arrest : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గృహనిర్బంధం - Tpcc Chief revanth reddy arrest

Revanth Reddy House Arrest : హైదరాబాద్​లోని జూబ్లీహిల్స్​లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నివాసం వద్ద పోలీసులను భారీగా మోహరించారు. ఇవాళ ఆయన వరంగల్ పర్యటనకు వెళ్తున్నట్లు ప్రకటించడంతో రేవంత్​ను గృహనిర్బంధం చేశారు. ఇంటి నుంచి రేవంత్ బయటకు రాకుండా అడ్డుకునేందుకు రంగం సిద్ధం చేశారు.

Revanth Reddy House Arrest
Revanth Reddy House Arrest
author img

By

Published : Dec 31, 2021, 5:19 PM IST

Revanth Reddy House Arrest : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గృహనిర్బంధం

Revanth Reddy House Arrest : హైదరాబాద్​లోని జూబ్లీహిల్స్​లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఇవాళ ఆయన వరంగల్ పర్యటనకు వెళ్తున్నట్లు ప్రకటించడంతో రేవంత్​ను గృహనిర్బంధం చేశారు. ఇంటి నుంచి రేవంత్ బయటకు రాకుండా అడ్డుకునేందుకు రంగం సిద్ధం చేశారు.

Revanth Reddy House Arrest Today : సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు కొండపల్లి దయాసాగర్‌ తండ్రి దశదిన కర్మకు వెళ్లడంతో పాటు.. ఇటీవల శబరిమలలో చనిపోయిన కాంగ్రెస్‌ నాయకుడు చరణ్‌ కుటుంబాన్ని పరామర్శించడానికి వరంగల్‌ వెళ్లనున్నట్లు రేవంత్‌ ప్రకటించారు. ఇవాళ వరంగల్‌ శివార్లలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించాలని అంతకుముందు రేవంత్‌ రెడ్డి నిర్ణయించారు. అయితే.. డిసెంబర్‌ 31న అని పోలీసులు రచ్చబండ కార్యక్రమానికి అనుమతి నిరాకరించారు. వరంగల్‌ వెళ్తానని ప్రకటించిన రేవంత్‌... రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తారన్న అనుమానంతో పోలీసులు రేవంత్‌ రెడ్డిని హైదరాబాద్‌లో గృహనిర్బంధం చేశారు.

Revanth Reddy Warangal Tour : పోలీసులను చూసి బయటకు వచ్చిన రేవంత్​ను వారు అడ్డుకున్నారు. తన ఇంటి ఆవరణలో భారీగా పోలీసులు మోహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతి లేకుండా తన ఇంట్లోకి ఎందుకు వచ్చారని ప్రశ్నించారు.

Revanth Reddy Comments on CM KCR : 'తెలంగాణలో పౌర స్వేచ్ఛను ముఖ్యమంత్రి కేసీఆర్ హరిస్తున్నారు. ప్రతిపక్ష నేతల ఇళ్లలోకి పోలీసులను ఉసిగొల్పుతున్నారు. సన్నిహితులు, మిత్రులు, బంధువుల ఇళ్లలో పరామర్శలకు, శుభకార్యాలకు కూడా వెళ్లనీయకుండా నిర్బంధకాండకు పాల్పడుతున్నారు.'

- రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

Revanth Reddy Fires on CM KCR : కాంగ్రెస్ పార్టీ అంటే ముఖ్యమంత్రి కేసీఆర్​ వెన్నులో వణుకుపుడుతోందని రేవంత్ రెడ్డి అన్నారు. తాము ఇంట్లో నుంచి కాలు కదిపితే గజగజ వణికిపోతున్నారని తెలిపారు. ప్రజాగ్రహం పెల్లుబికిన రోజు.. కేసీఆర్ ఫాంహౌజ్, ప్రగతిభవన్​లు బద్ధలైపోతాయని హెచ్చరించారు. రైతులు చనిపోతుంటే.. వారి కుటుంబాలను పరామర్శించడం తప్పా అని ప్రశ్నించారు. మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లకు శుభకార్యాలు, పరామర్శలకు వెళ్తున్న కేసీఆర్​కు ధాన్యం, మిర్చీ రైతుల చావుకేకలు వినిపించడం లేదా అని నిలదీశారు. పెద్దోళ్ల ఇంటికి వెళ్లే ముఖ్యమంత్రికి.. పేద రైతు కుటుంబాన్ని పరామర్శించే తీరకలేదా అని అడిగారు. సీఎం ఎలాగూ వెళ్లరు.. తాము పరామర్శకు వెళ్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.