ETV Bharat / city

REVANTH REDDY: 'సీఎం కేసీఆర్​ బినామీ సంస్థలే వేలంలో పాల్గొన్నాయి'

author img

By

Published : Jul 17, 2021, 7:23 PM IST

తెలంగాణలోని కోకాపేట భూముల వేలంలో అక్రమాలు జరిగాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి(REVANTH REDDY) ఆరోపించారు. ఆన్‌లైన్‌ టెండర్ అని చెప్తూనే.. పాలకవర్గంలోని బినామీలే వేలంలో పాల్గొన్నారని విమర్శించారు. భూముల వేలంలో నిబంధనల ఉల్లంఘన జరిగిందని ధ్వజమెత్తారు. భవిష్యత్తులో ప్రభుత్వ అవసరాలకు భూములు కావాలంటే ఎక్కడి నుంచి తెస్తారని రేవంత్​ నిలదీశారు.

REVANTH REDDY
సీఎం కేసీఆర్​ బినామీ సంస్థలే వేలంలో పాల్గొన్నాయి

ఒకవైపు తెలంగాణ ధనిక రాష్ట్రం అని చెబుతూనే మరోవైపు ప్రభుత్వ భూములను విక్రయిస్తున్నారని.. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (REVANTH REDDY) ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ప్రభుత్వ ఆస్పత్రులు, విద్యాలయాలకు భూములు కావాలంటే ఏం చేస్తారంటూ ప్రశ్నించారు. భవిష్యత్‌ అవసరాలను అంచనా వేయకుండా తెలంగాణ జాతి సంపదను సీఎం కేసీఆర్‌ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం విక్రయిస్తూపోతే.. చివరకు శ్మశానాలకూ స్థలం దొరకని పరిస్థితులు నెలకొంటాయన్నారు.

కోకాపేట భూములను వేలం వేయడం ద్వారా రూ.2 వేల కోట్లు వచ్చాయని హెచ్ఎండీఏ ప్రకటించింది. ఆన్‌లైన్‌ టెండర్‌ అని చెప్తూనే.. పాలక వర్గం బినామీలే వేలంలో పాల్గొన్నారు. తెరాస నేతల కుటుంబాల వారే భూములు కొన్నారు. వేలంలో పాల్గొనవద్దని కొందరిని బెదిరించారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం భూములు అమ్ముతుంటే తెరాస విమర్శించింది. ఆన్‌లైన్‌ ద్వారా జరిగే వేలంలో ఎన్నో అంతర్జాతీయ సంస్థలు పాల్గొంటాయని.. తద్వారా ఇక్కడ ఎన్నో అంతర్జాతీయ సంస్థలు పరిశ్రమలను నెలకొల్పుతాయని చెప్పారు. ఎంతో మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని మాయమాటలు చెప్పారు. చివరికి సీఎం కేసీఆర్‌ బినామీ సంస్థలే వేలంలో పాల్గొన్నాయి.-రేవంత్​రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

ఇదీ చదవండి:

TIDCO: '26 నెలలు గడిచినా వైకాపా ఏ ఒక్క హామీని అమలు చేయలేదు'

తెలంగాణలో రేపటి నుంచి థియేటర్లు ఓపెన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.