ETV Bharat / city

Tourism: హైదరాబాద్‌లో నేటి నుంచి ప్రారంభం కానున్న పర్యాటకం

హైదరాబాద్‌లో నేటి నుంచి పర్యాటకం ప్రారంభం కానుంది. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ సందర్శకులను ఆహ్వానించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఆదివారం సాయంత్రం నుంచే లుంబినీ పార్కు, ఎన్టీఆర్ గార్డెన్, తీగల వంతెన, ట్యాంక్‌బండ్‌ వంటి ప్రాంతాల్లో సందర్శకుల సందడి మొదలవగా.. ఈ రోజు నుంచి శిల్పారామం, పార్కులు, ప్రదర్శన శాలలు తెరుచుకోనున్నాయి.

tourism going to start at Hyderabad
tourism going to start at Hyderabad
author img

By

Published : Jun 21, 2021, 7:41 AM IST

కరోనాతో కుదేలైన అన్ని రంగాల్లో పర్యాటక రంగం ఒకటి. కర్ఫ్యూ ఆంక్షల నుంచి లాక్​డౌన్ విధింపు వరకు ఆది నుంచి మహమ్మారి ప్రభావానికి గురైన పర్యాటక రంగం లాక్‌డౌన్ ఎత్తివేతతో కాస్త ఊపిరి పీల్చుకోనుంది. తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో లాక్‌డౌన్ ఎత్తివేయటంతో ఆదివారం కొన్ని బహిరంగ పర్యాటక ప్రాంతాలు, పార్కులు సందర్శకులతో సందడిగా కనిపించాయి. దుర్గం చెరువు తీగల వంతెన, ట్యాంక్ బండ్, లూంబినీ పార్కు, ఎన్టీఆర్ గార్డెన్స్ వంటివి తెరుచుకోగా.. నగర ప్రజలు సేదతీరేందుకు వచ్చారు. నేటి నుంచి మిగిలి అన్ని పర్యాటక ప్రాంతాలు అందుబాటులోకి రానున్నాయి.

కొవిడ్​ నిబంధనలు పాటిస్తూ...

గోల్కొండ కోట, చార్మినార్, సెవెన్ టూంబ్స్, మ్యూజియం, ఇతర అన్ని పార్కుల్లో పర్యాటకులను అనుమతించనున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎక్కడికక్కడ కొవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకున్నారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, నిర్వహకులు శానిటైజర్లు అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు చేశారు. శిల్పారామం సోమవారం ఉదయం పదిన్నర గంటల నుంచి తెరుచుకోనుంది. రాత్రి 8గంటల వరకు సందర్శకులను అనుమతించనున్నారు.

చాలా రోజుల తర్వాత ప్రారంభం

కరోనా ఒత్తిడి నుంచి చాలా రోజుల తర్వాత ఉపశమనం దొరుకుతోందని.. పర్యాటకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పర్యాటక ప్రాంతాల్లో కోవిడ్ నిబంధనలు పాటించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. ప్రజలు తప్పక నిబంధనలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

ఇదీ చదవండి:

కొవిడ్ వ్యాక్సినేషన్‌లో రాష్ట్రం సరికొత్త రికార్డు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.