- 'ఆనందయ్య మందుకు అనుమతి వస్తే.. ఔషధం తయారీకి తితిదే సిద్ధం'
ఆనందయ్య మందుకు అనుమతి వస్తే ఔషధం తయారీకి తితిదే సిద్ధమని పాలకమండలి సభ్యుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. వైద్యుల బృందంతో కలిసి ఆయుర్వేద ఔషధం పరిశీలించామన్న చెవిరెడ్డి..మందులో దుష్ప్రభావ పదార్థాలు లేవని వైద్యులు చెప్పారన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'ఆనందయ్యది ఆయుర్వేదం కాదు..నాటు మందు'
కృష్ణపట్నం ఆనందయ్య మందును నాటు మందుగా గుర్తించినట్లు రాష్ట్ర ఆయుశ్ శాఖ కమిషనర్ కర్నల్ రాములు స్పష్టం చేశారు. కృష్ణపట్నంలో పర్యటించిన కమిషనర్ నేతృత్వంలోని వైద్య బృందం మందు తయారీ విధానాన్ని పరిశీలించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. పరిమితంగానే తుపాను ప్రభావం!
తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. నేటి రాత్రివరకు.. ఈ అల్పపీడనం వాయుగుండంగా మారుతుందని వాతావరణశాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాలపై పరిమితంగా తుపాను ప్రభావం ఉంటుందని, ఇవాళ ఇరు రాష్ట్రాల్లో వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- భారత్‌లో 2% కాదు.. 24% మందికి కరోనా!
భారత్‌లో 24.1 శాతం మంది కరోనా బారినపడినట్లు ఐసీఎంఆర్ ఇటీవల నిర్వహించిన సెరోసర్వేలో వెల్లడైంది. ఒక్క కరోనా కేసు గుర్తిస్తే.. 27 మందికి వైరస్ సోకినట్లే అని పేర్కొంది. దేశంలో పదేళ్లు పైబడిన ప్రతి నలుగురిలో ఒకరు కరోనా బాధితులే అని సర్వే స్పష్టం చేసింది. అయితే ఈ లెక్కలకు, ప్రభుత్వం ప్రకటించిన గణాంకాలకు అసలు పొంతనలేకపోవడం గమనార్హం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- డాక్టర్ రెడ్డీస్ నుంచి కరోనాకు కొత్త ఔషధాలు!
కొవిడ్ రోగుల కోసం కొత్త చికిత్సా విధానాలను తాము అభివృద్ధి చేస్తున్నామని డాక్టర్ రెడ్డీస్ తెలిపింది. రానున్న నెలల్లో వీటిని అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పింది. అదే సమయంలో.. ప్రస్తుతం వినియోగిస్తున్న ఔషధాల ఉత్పత్తిని కూడా కొనసాగిస్తామని పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 100 ఆక్సిజన్ పడకలు ఏర్పాటు చేసిన స్టార్ సింగర్
కరోనా పరిస్థితుల్లో ప్రాణవాయువు కొరతతో సతమతమవుతున్న వైరస్ బాధితులను ఆదుకునేందుకు పాప్ సింగర్ స్మిత ముందుకొచ్చింది. పలు కొవిడ్ సెంటర్లలో మొత్తంగా కలిపి 100 ఆక్సిజన్ పడకలను ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని ట్వీట్ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'చైనా మారథాన్'లో విషాదం- 21 మంది మృతి
చైనాలో నిర్వహించిన ఓ మారథాన్.. 21 మందిని బలి తీసుకుని తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. గాన్సూ రాష్ట్రంలో చేపట్టిన 100 కిలోమీటర్ల క్రాస్ కంట్రీ మౌంటెన్ రేస్‌లో.. మరో ఎనిమిది మందికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితులే ఈ దుర్ఘటనకు కారణమని స్థానిక వార్తా సంస్థ తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సీనియర్ సిటిజన్స్ స్పెషల్ ఎఫ్‌డీ స్కీమ్‌లు ఇవే..
కొవిడ్ సంక్షోభం కారణంగా వడ్డీ రేట్లు తగ్గుతున్న తరుణంలో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఆధారపడిన సీనియర్ సిటిజెన్లకు ఇటీవల కాలంలో ఆదాయం బాగా తగ్గిపోయింది. ఈ పరిస్థితుల్లో కొన్ని బ్యాంకులు వీరి కోసం ప్రత్యేక పథకాలను అందిస్తున్నాయి. ఆ వివరాలు మీకోసం.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రెజ్లర్ సుశీల్ అరెస్టు: కెరీర్‌ను నాశనం చేసిన అద్దె గొడవ
మల్లయోధుడు సాగర్ రానా హత్య కేసులో స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ అరెస్టయ్యాడు. అయితే సాగర్ మరణంలో సుశీల్ హస్తమేంటి? అసలు ఏం జరిగింది? ఈ వివాదానికి కారణమేంటి? తదితర విషయాలు సమాహారమే ఈ స్టోరీ. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఒకే వ్యక్తికి వేర్వేరు టీకాలు ఇవ్వొచ్చా?
దేశంలో ప్రస్తుతం.. కొవిషీల్డ్, కొవాగ్జిన్‌తో పాటు స్పుత్నిక్-వి టీకాలు అందుబాటులో ఉన్నాయి. నిబంధనల ప్రకారం.. తొలి మోతాదు టీకా వ్యాక్సిన్ తీసుకున్న వారు నిర్దిష్ట గడువు అనంతరం రెండో డోసు వేయించుకోవాలి. అయితే.. రెండో డోసులో కచ్చితంగా అదే రకం టీకానే తీసుకోవాలా? లేక వేరే వ్యాక్సిన్ తీసుకోవచ్చా? అనే అంశంపై అధ్యయనాలు చేపడుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.