- కొనసాగుతున్న ఉపరితల ద్రోణి.. రాష్ట్రవ్యాప్తంగా మూడ్రోజుల పాటు భారీ వర్షాలు
రాష్ట్రంలో మళ్లీ జోరువానలు కురుస్తున్నాయి. కోస్తాంధ్రను అనుకుని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ రెండింటి ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో చాలాచోట్ల విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి.
- తిరుమలకు భారీగా భక్తులు.. శ్రీవారి దర్శనానికి రెండు రోజులు
తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. తిరు వీధులు భక్తులతో కిక్కిరిసిపోయాయి. దేవదేవుని దర్శనం కోసం.. వేలాదిమంది భక్తులు తరలిరావడంతో వైకుంఠ క్యూ కాంప్లెక్స్‌లు, నారాయణ గిరి షెడ్లు నిండిపోయాయి. వైకుంఠనాథుని దర్శించుకొనేందుకు కాలినడకన, వాహనాల ద్వారా వచ్చే భక్తుల సంఖ్య కొనసాగుతోంది. భక్తులు భారీగా తరలిరావడంతో శ్రీవారి సర్వ దర్శనానికి రెండు రోజుల సమయం పడుతోంది. భక్తుల రద్దీని దృష్టి ఉంచుకొని తిరుమల యాత్రను చేయాలని తితిదే విజ్ఞప్తి చేసింది.
- ఆ వివరాలు చెప్పండి.. సీఐడీకి చింతకాయల విజయ్ లేఖ
41A నోటీసులపై సీఐడీకి తెలుగుదేశం నాయకుడు చింతకాయల విజయ్ లేఖ రాశారు. ఈ లేఖను అందించేందుకు సీఐడీ కార్యాలయానికి వెళ్లిన విజయ్ తరఫు న్యాయవాదులు.. 4 గంటలపాటు వేచి ఉన్నా అధికారులు తీసుకోకపోవడంతో తప్పాల్‌లో ఇచ్చి వెళ్లారు.
- మాటకు లొంగని వ్యక్తి హృదయ స్పందనకు లొంగుతారన్న చిరంజీవి
అలయ్ బలయ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నానని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. కుల మతాలకు అతీతంగా నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతిలో అంతర్భాగంగా ఉన్న అలయ్ బలయ్ దేశవ్యాప్తం కావాలని ఆకాంక్షించారు.
- కొచ్చిలో రూ.200 కోట్ల హెరాయిన్ సీజ్.. ముంబయిలో మరో రూ.100 కోట్లు..
కేరళలోని కొచ్చి సముద్రతీరంలో భారీగా హెరాయిన్ పట్టుబడింది. ఇరాన్ పడవలో సుమారు రూ.200 కోట్ల విలువైన హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు నార్కోటిక్ అధికారులు. మరోవైపు, ముంబయి విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి నుంచి రూ.100 కోట్ల విలువైన హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు డీఆర్ఐ అధికారులు.
- 'నా భార్య కూడా మీలా తిట్టదు.. ఇలా లవ్ లెటర్స్ పంపదు'.. గవర్నర్‌కు సీఎం కౌంటర్
దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ వినూత్నంగా కౌంటర్ ఇచ్చారు. ఇటీవల తనకు ఎల్జీ వరుసగా లేఖలు రాయడాన్ని విమర్శిస్తూ ట్వీట్ చేశారు.
- ఫ్రెంచ్ రచయిత్రికి సాహిత్య నోబెల్.. 17వ మహిళగా రికార్డు..
2022 ఏడాదికి సాహిత్య నోబెల్ ఫ్రెంచ్ రచయిత్రి అనీ ఎర్నాక్స్‌ను వరించింది. వ్యక్తిగత జ్ఞాపకాలపై ఎర్నాక్స్ చేసిన రచనలకు ఈ పురస్కారం అందిస్తున్నట్లు నోబెల్ కమిటీ వెల్లడించింది.
- 30 రెట్లు అధిక వేగంతో ఎయిర్టెల్ 5జీ సేవలు.. 1.5 జీబీపీఎస్ దాటిన జియో!
దేశంలోని 8 నగరాల్లో ఎయిర్టెల్ 5జీ ప్లస్ సేవలు ప్రారంభమయ్యాయి. ఈ సేవలను పొందేందుకు సిమ్ కార్డు మార్చాల్సిన అవసరం లేదని, 5జీ ఫోన్ ఉంటే సరిపోతుందని ఎయిర్టెల్ వెల్లడించింది. మరోవైపు, జియో నెట్ స్పీడ్ 1.5 జీబీపీఎస్‌గా నమోదైంది.
- ఒకే చోట సచిన్, ధోని.. టెన్నిస్ కోర్టులో సరదాగా.. ఫొటోలు వైరల్
చాలా రోజుల తర్వాత సచిన్ తెందూల్కర్, ఎంఎస్ ధోని ఒకే చోట కనిపించారు. దీంతో తమ అభిమాన క్రికెటర్ల ఫొటోలను వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్.
- 'ఆదిపురుష్'కు కాపీ సెగ.. ఘాటు వ్యాఖ్యలు చేసిన యానిమేషన్ సంస్థ
'ఆదిపురుష్' సినిమా టీజర్ విడుదల మొదలు.. ఆ సినిమాపై ట్రోలింగ్ వర్షం కురుస్తోంది. వీఎఫ్ఎక్స్ బాగోలేదంటూ సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్ చేస్తున్నారు నెటిజన్స్. అదే కోవలో ఈ సినిమాపై మరో ఆరోపణ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే..
TOP NEWS: ప్రధాన వార్తలు @ 9PM - ఏపీలో ఇప్పటివరకు ఉన్న వార్తలు
ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలు
top news