- బ్రేక్ దర్శనాల సమయం మార్పు.. తితిదే కీలక నిర్ణయాలు
Tirumala: బ్రహ్మోత్సవాల అనంతరం బ్రేక్ దర్శనాల సమయంలో మార్పులు తీసుకువస్తున్నట్లు తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. బ్రహ్మోత్సవాలు, భక్తుల రద్దీ నియంత్రణ కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రాథమికంగా రోజుకు 20 వేల చొప్పున సర్వదర్శన టోకెన్లు అందుబాటులో ఉంటాయని అన్నారు.
- నంద్యాలలో కానిస్టేబుల్ హత్య కేసును సీబీఐకి అప్పగించాలన్న వైకాపా నేత
నంద్యాలలో వైకాపా నాయకుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి, వైకాపాకు చెందిన మరో నాయకుడు మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య మాటల యుద్ధం పెరుగుతోంది. రౌడీలకు ఎమ్మెల్యే అండగా ఉంటున్నాడని, రాజగోపాల్‌రెడ్డి ఆరోపించారు. కానిస్టేబుల్ సురేంద్ర హత్య కేసును సీబీఐకి అప్పగిస్తే..వాస్తవాలు బయటకు వస్తాయని ఆయన అన్నారు.
- రైతుల మహా పాదయాత్ర.. జై అమరావతి నినాదాలతో దద్దరిల్లిన గుడివాడ
Padayatra: జై అమరావతి నినాదాలతో గుడివాడ ప్రతిధ్వనించింది. రైతుల మహాపాదయాత్రకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. ఆంక్షలు, అడ్డంకులనూ లెక్కచేయకుండా గుడివాడ వాసులు.. రైతులకు మద్దతుగా కదంతొక్కారు. భారీగా తరలివచ్చిన ప్రజలు, విద్యార్థులు, రాజకీయ పార్టీల నేతలు..సంఘీభావం ప్రకటిస్తూ పాదయాత్రలో పాల్గొన్నారు.
- లంక గ్రామాలను వీడని వరద కష్టాలు
Floods in konaseema: గోదావరి నదికి మళ్ళీ వరద పోటెత్తడంతో ధవలేశ్వరం బ్యారేజీ నుంచి ఆరు లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వదులుతున్నారు. బ్యారేజీ దిగువన ఉన్న కనకాయలంక కాజ్వే మరో సారి మునిగిపోయింది. దానితోపాటు వశిష్ట, వైనతేయ, గౌతమి గోదావరి నది పాయలు జోరుగా ప్రవహిస్తున్నాయి. కోనసీమ జిల్లాలో పలు గ్రామాల ప్రజలు మరపడవలపై రవాణ సాగిస్తున్నారు.
- ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు కూలీలు దుర్మరణం
మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టెంపోను సిమెంట్ లోడ్‌తో వెళ్తున్న ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో బిహార్‌కు చెందిన ఐదుగురు కూలీలు మరణించారు.
- విషాదం.. వేడి టీలో పడి ఏడాది చిన్నారి మృతి
ఆడపిల్ల పుట్టిందని ఆమె తల్లిదండ్రులు ఎంతో సంతోషపడ్డారు. అల్లారుముద్దుగా పెంచుతున్నారు. కానీ ఆ ఆనందం ఎన్నాళ్లు నిలవలేదు. వేడి టీ ఉన్న పాత్రలో పడి ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ హృదయవిదారక ఘటన మహారాష్ట్రలో జరిగింది.
- చైనాలో సైనిక తిరుగుబాటు.. గృహ నిర్బంధంలో జిన్‌పింగ్!
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను గృహనిర్బంధంలో ఉంచినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బీజింగ్‌ను పెద్ద ఎత్తున సైనిక వాహన శ్రేణులు చుట్టుముట్టినట్టు పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బీజింగ్ నుంచి అంతర్జాతీయ విమానాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయనీ, బయటి ప్రపంచంతో చైనా రాజధాని నగరానికి సంబంధాలు తెగిపోయాయని ప్రచారం జరుగుతోంది.
- 'ఇతర దేశాల కరెన్సీ కంటే 'మన రూపాయి' మెరుగే'
పాశ్చాత్య దేశాల కరెన్సీతో పోలిస్తే డాలరుతో రూపాయి విలువ బాగానే రాణిస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఇటీవల రూపాయి మారకం విలువ భారీగా పతనమైన నేపథ్యంలో ఆర్థిక మంత్రి స్పందించారు. రిజర్వ్ బ్యాంక్, ఆర్థిక మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నాయని ఆమె చెప్పారు.
- జులన్‌కు ఘనంగా వీడ్కోలు.. ఇంగ్లాండ్ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన భారత్
Jhulan Goswami Last Match : దాదాపు రెండు దశాబ్దాల కెరీర్.. పేస్ బౌలింగ్‌కు చిరునామా.. అంతర్జాతీయ వికెట్లలో అగ్రస్థానం! భారత మహిళల క్రికెట్‌కు పెద్ద దిక్కు! జులన్ గోస్వామి ఆటను ముగించింది. భావోద్వేగాల నడుమ క్రికెట్‌కు టాటా చెప్పింది. వన్డే సిరీస్‌లో ఇంగ్లాండ్‌ను క్లీన్‌స్వీప్ చేసిన భారత్ జట్టు.. జులన్‌కు ఘనంగా వీడ్కోలు పలికింది.
- వామ్మో.. జక్కన్న-మహేశ్ సినిమాలో థోర్ కూడానా!
దర్శకుడు రాజమౌళి-సూపర్ స్టార్ మహేశ్‌బాబు కాంబినేషన్లో రాబోతున్న సినిమా గురించి షాక్ మీద్ షాక్ అయ్యే రేంజ్లో వార్తలు వస్తున్నాయి. వాటి గురించే ఈ కథనం..
TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 7AM - ఆంధ్రప్రదేశ్ ప్రధాన వార్తలు
.
top news

Last Updated : Sep 25, 2022, 7:12 AM IST