ETV Bharat / city

TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 9 PM - ap top ten news

ఏపీ ప్రధాన వార్తలు

Top News
ఏపీ ప్రధాన వార్తలు
author img

By

Published : Sep 18, 2022, 9:01 PM IST

  • Justice Battu Devanand: రాష్ట్ర రాజధాని ఇదీ... అని చెప్పుకొనే పరిస్థితి ఉందా?
    Justice Battu Devanand : రాష్ట్రంలోని తాజా పరిణామాలపై రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. 75 స్వాతంత్య్ర భారతావనిలో తెలుగు వారికి ఇదీ రాష్ట్ర రాజధాని అని చెప్పుకొనే పరిస్థితి ఉందా? అని ప్రశ్నించారు. బయట వారి వద్ద అవమానాలు ఎదుర్కొనే పరిస్థితికి తెలుగు జాతి చేరిందని ఆవేదన చెందారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • NIA : తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా ఎన్‌ఐఏ తనిఖీలు
    NIA searches: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కేసులో తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా ఎన్‌ఐఏ సోదాలు చేస్తోంది. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని ఖాజానగర్‌లో పీఎఫ్‌ఐ కేసులో నిందితులు, అనుమానితుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తుండగా..ఓ వర్గం ప్రజలు ఎన్‌ఐఏ అధికారుల అడ్డుకున్నారు. నంద్యాలలో సైతం ఇదే పరిస్థితి ఎదురైంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • చట్టసభల సాక్షిగా ప్రమాణం చేసి.. మాట తప్పితే విలువేం ఉంటుంది: పవన్​కల్యాణ్
    Pawan Kalyan: మంగళగిరిలో పార్టీ లీగల్​ సెల్​ సమావేశంలో మాట్లాడిన జనసేన అధినేత పవన్​కల్యాణ్ రాజధాని ఆంశంపై స్పందించారు. ప్రభుత్వం రాజధానిపై అనుసరిస్తున్న విధానం దారుణమని ఆయన అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఏడో రోజు రైతుల మహాపాదయాత్ర.. రెచ్చగొట్టేలా వైకాపా ఫ్లెక్సీలు
    Farmers Maha Padyatra: రాజధాని రైతుల పాదయాత్ర సాగుతున్న మార్గంలో పండుగ వాతావరణం నెలకొంది. పల్లెలకు పల్లెలు తరలివచ్చి.. అన్నదాతలకు నీరాజనాలు పలుకుతున్నారు. సందడిగా సాగుతున్న రైతుల పాదయాత్ర కృష్ణాతీరంలోని అమరావతి.. సాగరతీరానికి తరలివచ్చిందా అన్నట్లుగా కనిపిస్తోంది. రైతుల పాదయాత్ర ఇవాళ బాపట్ల జిల్లా నగరం నుంచి రేపల్లె వరకు జరిగింది. రైతులు పాదయాత్ర చేసే మార్గంలో వైకాపా నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీనిని శాంతియుతంగా ఎదుర్కొంటామని రైతులు పేర్కొంటున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఉచితాలపై తగ్గని ఆప్.. తటపటాయిస్తున్న భాజపా.. 2022 బాద్​షా ఎవరో?
    AAP Freebies in Gujarat: గుజరాత్​లో శాసనసభ ఎన్నికలకు మరో కొన్ని నెలల సమయమే ఉంది. ఇప్పుడు దేశమంతా ఆ ఎన్నికల కోసమే ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఎందుకంటే ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఉచిత పథక హామీలు కురిపిస్తుంటే.. భాజపా మాత్రం సైలెంట్​గా ఉంది. ఉచితాలను కాషాయ పార్టీ వ్యతిరేకిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • అమ్మాయిల ప్రైవేట్ వీడియోలు లీక్.. విద్యార్థుల ఆందోళనలతో యూనివర్సిటీలో దుమారం
    Chandigarh university protest : విద్యార్థుల ఆందోళనలతో పంజాబ్ మోహాలీలోని చండీగఢ్ విశ్వవిద్యాలయం అట్టుడికింది.ఓ విద్యార్థిని హాస్టల్‌గదిలో తన సహచరులు స్నానం చేస్తున్న వీడియోలను రికార్డు చేసి స్నేహితుడికి పంపగా.. అతడు సామాజిక మాధ్యమాల్లో పెట్టాడనే ప్రచారంతో తీవ్ర దుమారం రేగింది. దోషులను కఠినంగా శిక్షించాలంటూ విద్యార్థులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. వీడియోలు రికార్డు చేసిన విద్యార్థినిని అరెస్టు చేసిన పోలీసులు.. మొత్తం వ్యవహారంపై విచారణ చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • తైవాన్​లో మరోసారి భారీ భూకంపం- కుప్పకూలిన మూడంతస్తుల భవనం
    తైవాన్​ను​ భారీ భూకంపం అతలాకుతలం చేసింది. ఓ మూడంతస్తుల భవనం కూలిపోగా.. పలు చోట్ల ఆస్తి నష్టం జరిగింది. యూలిలో కొండచరియలు విరిగిపడగా అక్కడున్న దాదాపు 400 మంది పర్యటకులు చిక్కుకుపోయారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • టర్మ్ పాలసీలకు రక్షణగా 'రైడర్లు'
    Insurance Policy Rider : అనుకోని ఘటనలు ఎదురై.. ఆర్జించే కుటుంబ పెద్ద దూరమైనప్పుడు.. ఆర్థికంగా ఆ కుటుంబానికి భరోసానిచ్చేవి బీమా పాలసీలు. వీటిలో తక్కువ ప్రీమియంతో అధిక రక్షణ కల్పించే టర్మ్‌ పాలసీల వైపు ఇప్పుడు ఎంతోమంది మొగ్గు చూపుతున్నారు. దీనికి కొన్ని అనుబంధ పాలసీలు (రైడర్లు) జోడించుకోవడం ద్వారా అదనపు రక్షణ పొందేందుకు అవకాశం ఉంటుంది. అవేమిటి? ఎలా ఉపయోగ పడతాయి? తెలుసుకుందాం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఎవరు ఏమనుకున్నా సరే.. అతడే నంబర్ 1 ఆల్​రౌండర్!
    హార్దిక్ పాండ్యపై రవి శాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హార్దిక్‌ పాండ్యనే నంబర్‌వన్ ఆల్‌రౌండర్‌ అని స్పష్టం చేశాడు. ఓ క్రీడా షోలో ఈ వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఉరేసుకుని యువ నటి ఆత్మహత్య.. ప్రేమ వ్యవహారమే కారణమా?
    పలు చిత్రాల్లో నటించిన యువ నటి దీప.. తన ఇంటిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే గత కొన్నాళ్లుగా ఒంటరిగా ఉంటున్న దీప.. మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడిందని స్నేహితులు చెబుతున్నారు. పోలీసులు మాత్రం ప్రేమ వ్యవహారమే కారణమని అనుమానిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.