ETV Bharat / city

TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 9 PM - ap top ten news

ఏపీ ప్రధాన వార్తలు

Top News
ఏపీ ప్రధాన వార్తలు
author img

By

Published : Sep 11, 2022, 8:59 PM IST

  • రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూత.. విషాదంలో సినీలోకం
    Actor Krishnam Raju Dead : ప్రముఖ నటుడు 'రెబల్ స్టార్' కృష్ణంరాజు(83) కన్నుమూశారు. హైదరాబాద్​లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున 3.25 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారని కుటుంబసభ్యులు తెలిపారు. సోమవారం హైదరాబాద్​లో అంత్యక్రియలు జరుగుతాయని చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • రెట్టించిన ఉత్సాహంతో.. అమరావతి రైతుల మలివిడత పాదయాత్ర
    Capital Farmers Padayatra: అమరావతి రైతుల రెండో విడత మహాపాదయాత్రకు సర్వం సిద్ధమైంది. రాజధానిలోని తితిదే వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి అరసవెల్లి సూర్యదేవుని సన్నిధి వరకూ జరిగే యాత్ర కోసం రైతులు, రైతుకూలీలు ఉత్సాహంతో ఉన్నారు. సోమవారం ఉదయం ప్రారంభమయ్యే యాత్ర 60రోజుల పాటు జరగనుంది. తమకు జరిగిన అన్యాయాన్ని జనంలోకి తీసుకెళ్లటంతో పాటు.. అమరావతి ఆవశ్యకతను ప్రజలకు తెలియజేయటమే లక్ష్యంగా పాదయాత్ర జరుగుతుందని రైతులు చెబుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • Gudivada Police Station: కొడాలి నాని వ్యాఖ్యలపై తెదేపా ఆగ్రహం.. గుడివాడలో ఉద్రిక్తత
    Tension Gudivada Police Station: గుడివాడ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కొడాలి నానిపై ఫిర్యాదు చేసేందుకు తెదేపా నేతలు ప్రయత్నించగా.. పార్టీ కార్యాలయం వద్ద తెదేపా శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. తెదేపా నాయకులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • Janasena: రాజు మారినప్పుడల్లా.. రాజధాని మారదు: నాదెండ్ల మనోహర్​
    Nadendala Manohar on farmers padayatra: రాజు మారినప్పుడల్లా రాజధాని మారదని జనసేన నేత నాదెండ్ల మనోహర్​ అన్నారు. ఒక రాజధానినే కట్టలేని జగన్..​ మూడు రాజధానులను ఎలా కడతారని ప్రశ్నించారు. రాజధాని రైతుల పాదయాత్రకు జనసేన మద్దతు ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • Rains in AP: వాయుగుండం ప్రభావం.. ఇవాళ,రేపు ఏపీకి భారీ వర్ష సూచన
    IMD:గత రెండు రోజులుగా రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా బంగాళాఖాతంలోని అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారినట్లు వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని, సముద్రం అల్లకల్లోలంగా మారుతుందని.. వాతావరణ శాఖ వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'కశ్మీర్‌కు ప్రత్యేక హోదా సాధ్యం కాదు..' ఆజాద్‌ కీలక వ్యాఖ్యలు
    Ghulam Nabi Azad Article 370 : జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఈ ఆర్టికల్‌ 370ని పునరుద్ధరిస్తామంటూ హామీలు ఇస్తూ ప్రజల్ని మోసగిస్తున్నాయన్నారు కేంద్ర మాజీ మంత్రి గులాం నబీ ఆజాద్‌. మూడేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన ఆర్టికల్‌ 370 తిరిగి పునరుద్ధరణ జరగదని స్పష్టంచేశారు. 10 రోజుల్లో కొత్త పార్టీని ప్రకటిస్తానని చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ద్వారకాపీఠ్​ శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి కన్నుమూత
    ద్వారకాపీఠ్​ శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి పరమపదించారు. 99 ఏళ్ల వయసులో ఆయన మధ్యప్రదేశ్​ నార్సింగ్​పుర్​లోని పీఠంలో తుది శ్వాస విడిచారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ప్రముఖ బాలీవుడ్​ నటుడే లక్ష్యంగా ముంబయిలో రెక్కీ..!
    బాలీవుడ్ నటుడు సల్మాన్​ ఖాన్​ను చంపేస్తామంటూ​ కొందరూ లేఖ రాశారు. ఇదివరకే సిద్ధూ మూసేవాలాను హత్య చేసిన నిందితులు.. అనంతరం సల్మాన్​కు లేఖ పంపించారు. లేఖలో ఏం చెప్పారంటే.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • యూఎస్​ ఓపెన్​ విజేతగా ఇగా స్వైటెక్‌.. తొలి క్రీడాకారిణిగా రికార్డు
    వరుస విజయాలతో ఫుల్​ ఫామ్​లో ఉన్న ఇగా స్వైటెక్‌ ప్రతిష్టాత్మక యూఎస్ ఓపెన్ 2022 టోర్నీ విజేతగా అవతరించింది. ఈ ట్రోఫీని ముద్దాడిన తొలి పోలెండ్​ మహిళగా రికార్డుకెక్కింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • సంగీత దర్శకుడు మణిశర్మ ఇంట్లో విషాదం
    ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తల్లి సరస్వతి(88) అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.