- తెలంగాణ కన్నా.. ఏపీ ద్రవ్యలోటే తక్కువ: ఆర్థిక మంత్రి బుగ్గన
MINISTER BUGGANA: ఏపీ మాత్రమే అప్పులు చేసినట్లు చిత్రీకరిస్తున్నారని.. ద్రవ్యలోటు కూడా ఎక్కువుగా ఉందని ఆరోపిస్తున్నారని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన విమర్శించారు. తెలంగాణతో పోల్చుకుంటే.. ఆంధ్రప్రదేశ్ ద్రవ్యలోటు తక్కువగా ఉందని పేర్కొన్నారు.
- మరోసారి బయటపడిన ఏపీ అప్పుల చిట్టా.. కేవలం 3 నెలల్లోనే సగానికి పైగా రుణాలు
AP LOAN: ఏపీ అప్పుల చిట్టాను మరోసారి పార్లమెంటులో కేంద్రం బయటపెట్టింది. అప్పులకు అనుమతించిన 3 నెలల్లోనే ఏపీ సగానికిపైగా రుణాలు తీసుకున్నట్లు రాజ్యసభలో కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి వెల్లడించారు. కేంద్రం, నాబార్డు నుంచి కూడా ఏపీ రుణాలు పొందినట్లు తెలిపారు.
- 'కోస్తాంధ్ర, తెలంగాణ మీదుగా సైక్లోనిక్ సర్కూలేషన్'.. అమరావతి వాతావరణ కేంద్రం
RAINS: మధ్యప్రదేశ్ నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకూ కోస్తాంధ్ర, తెలంగాణాల మీదుగా సైక్లోనిక్ సర్కులేషన్ కొనసాగుతోందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో మోస్తారు నుంచి తేలిక పాటి వర్షాలు కురుస్తున్నాయని వెల్లడించింది.
- CAR: పడమటి వాగులో కారు గల్లంతు.. డ్రైవర్ సేఫ్..
CAR: రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. రహదారులపై నీరు ప్రవహిస్తోంది. ప్రవహ ఉద్ధృతిని అంచనా వేయలేక ఆ రోడ్లపై వెళ్తూ వాహనాదారులు గల్లంతవుతున్నారు. మంగళవారు ఏలూరు జిల్లా పడమటి వాగులో ఓ కారు గల్లంతైంది. వాగు ఉద్ధృతి గమనించకుండా కారు డ్రైవర్ ముందుకెళ్లడంతో నీటిలో చిక్కుకుంది. స్థానికులు గమనించి అందులోని డ్రైవర్‌ను రక్షించారు. కానీ కారు మాత్రం కొట్టుకుపోయింది.
- పలువురు రాజ్యసభ సభ్యులపై సస్పెన్షన్ వేటు
నిరసనలతో గందరగోళం సృష్టిస్తూ, సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తున్నారంటూ పలువురు ఎంపీలను రాజ్యసభ నుంచి సస్పెండ్ చేశారు డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్. వారం రోజుల పాటు వీరిపై సస్పెన్షన్ కొనసాగుతుందని ప్రకటించారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మురళీధరన్ తీర్మానం ప్రవేశపెట్టారు. దీన్ని సభాపతి ఆమోదించారు.
- సోనియా ఈడీ విచారణపై కాంగ్రెస్ నిరసన.. పోలీసుల అదుపులో రాహుల్
Sonia Gandhi ED case: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మంగళవారం ఈడీ విచారణకు హాజరయ్యారు. ఆమెకు తోడుగా రాహుల్ కూడా ఈడీ కార్యాలయానికి వచ్చారు. అయితే సోనియాపై ఈడీ విచారణను నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనలు చేపట్టాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. పార్టీ ఎంపీలతో కలిసి విజయ్ చౌక్ నుంచి రాష్ట్రపతి కార్యాలయం వైపు నిరసనగా వెళ్లారు. రాహుల్, పార్టీ ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
- ఫోన్ ట్యాపింగ్‌పై ఉపరాష్ట్రపతి అభ్యర్థి సంచలన ఆరోపణలు
Margaret alva MTNL: కేంద్రంపై సంచలన ఆరోపణలు చేశారు విపక్షాల ఉపరాష్ట్ర అభ్యర్థి మార్గరెట్ ఆళ్వా. కేంద్రం ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడుతోందని.. రాజకీయ నేతలు ఫోన్లో ఏం మాట్లాడుకుంటున్నారో అన్నీ కేంద్రానికి తెలుసని అన్నారు. ఈ ఆరోపణలను తోసిపుచ్చారు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి. ఆళ్వా చేసిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు.
- పోలీసుల మంచి మనసు.. అనారోగ్యంతో ఉన్న కొండముచ్చుకు ఓఆర్ఎస్
ఉత్తరాఖండ్ హరిద్వార్ పోలీసులు తమ మంచి మనసును చాటుకున్నారు. కావడి యాత్ర వద్ద సెక్యూరిటీగా ఉన్న పోలీసుల వద్దకు ఓ కొండముచ్చు వచ్చింది. మొదట ఎందుకు వచ్చిందో తెలియని పోలీసులు తర్వాత కొండముచ్చు అనారోగ్యంతో ఉందని గ్రహించారు. వెంటనే జగ్వీర్ రాణా అనే కానిస్టేబుల్ ఓఆర్ఎస్ ద్రావణాన్ని వాటర్ బాటిల్‌తో కొండముచ్చుకు అందించి దాని దాహాన్ని తీర్చారు.
- బ్యాడ్ న్యూస్.. కామన్వెల్త్ గేమ్స్‌కు నీరజ్ చోప్రా దూరం
ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్ వేదికగా జరగనున్న కామన్వెల్త్ గేమ్స్‌లో కచ్చితంగా పతకం సాధిస్తాడనుకున్న భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా.. ఈ మెగా పోటీలకు దూరం అయ్యాడు. ఫిట్నెస్ కారణంగా నీరజ్ పోటీల్లో పాల్గొనడం లేదని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(ఐఓఏ) ప్రకటించింది.
AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 3 PM - AP NEWS
.
top news

Last Updated : Jul 26, 2022, 3:13 PM IST