ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 5PM - ap top news

..

TOP NEWS
ప్రధానవార్తలు
author img

By

Published : Sep 16, 2020, 5:00 PM IST

  • రూ.80 లక్షల సెల్​ఫోన్లు మాయం
    గుంటూరు జిల్లాలో కొత్త తరహా దొంగతనం జరిగింది. జాతీయ రహదారిపై వెళ్తున్న ఓ కంటైనర్​లో రూ.80 లక్షల విలువైన సెల్​ఫోన్లను దుండగులు అపహరించారు. కంటైనర్ రన్నింగ్​లో ఉండగా.. వెంబడించి దోపిడీ చేయడం గమనార్హం. గుంటూరు అర్బన్ ఎస్పీ ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
  • మూడు సింహాలు ఎవరు తీసుకెళ్లినట్టు?
    విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి వెండి రథంలోని నాలుగు సింహాల్లో.. మూడు సింహాలు మాయం కావడంపై రాజకీయపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆలయాల పవిత్రను ప్రభుత్వం కాపాడలేకపోతోందని ఆక్షేపించాయి.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
  • సాయిబాబా విగ్రహం ధ్వంసం
    కృష్ణా జిల్లా నిడమానూరు శ్రీ షిర్డీసాయిబాబా మందిరం బయట ఉన్న విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై భాజపా, తెదేపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
  • రీఛార్జి స్టేషన్ల ఏర్పాటు
    ఏపీలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీతో పాటు రీఛార్జి స్టేషన్ల ఏర్పాటుకు ఆసక్తిగా ఉన్నట్టు కైనటిక్ గ్రీన్ ఎనర్జీ సంస్థ స్పష్టం చేసింది. ఆ సంస్థ ప్రతినిధులు, కైనటిక్ గ్రీన్ ఎనర్జీ వ్యవస్థాపకురాలు సులజా ఫిరోడియా ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డితో భేటీ అయ్యారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
  • 'అర కోటి కరోనా కేసులనూ దేవుడి ఖాతాలోనే వేస్తారా?'
    భారత్​లో కరోనా కేసులు 50 లక్షలు దాటిన నేపథ్యంలో కేంద్రంపై విమర్శలు చేసింది కాంగ్రెస్​. కరోనా వ్యాప్తి కట్టడికి మోదీ సర్కార్​ తీసుకున్న చర్యల గురించి ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
  • ఈ నెల 30న బాబ్రీ కేసుపై తీర్పు
    బాబ్రీ మసీదు కేసులో ఈ నెల 30న తీర్పును వెలువరించనుంది సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం. కేసులో నిందితులందరూ ఆ రోజున కోర్టు ముందు హాజరుకావాలని న్యాయమూర్తి ఎస్​కే యాదవ్​ ఆదేశించారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
  • 'జీప్​ రేస్'​.. ఆ కిక్కే వేరప్పా!
    కర్ణాటకలోని చిక్కమగళూరులో "ఆఫ్​-రోడ్​ జీప్​ రేస్​" నిర్వహించారు. కరోనా సంక్షోభం జరిగిన తొలి రేస్​ కావడం వల్ల దీనికి విశేష ఆదరణ లభించింది. అడవులు, బురద, చెరువులు, కొండల మధ్య దాదాపు 30కిలోమీటర్ల పొడవున నిర్మించిన రేస్​ ట్రాక్​కు రైడర్లు ఫిదా అయిపోయారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
  • నెలలోపే అమెరికాకు వ్యాక్సిన్‌
    ప్రపంచ దేశాలు కరోనా వ్యాక్సిన్​ కోసం ఎదురుచూస్తోన్న తరుణంలో వ్యాక్సిన్​పై మరోమారు కీలక వ్యాఖ్యలు చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. నవంబర్​ కన్నా ముందే వ్యాక్సిన్​ అందుబాటులోకి వస్తుందని ఉద్ఘాటించారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
  • ఈసారి ఐపీఎల్​ మరింత స్పెషల్​
    ఐపీఎల్​లో ధోనీ బ్యాటింగ్​ కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారని భారత మాజీ క్రికెటర్​ వీరేందర్ సెహ్వాగ్​ అభిప్రాయపడ్డాడు. సెప్టెంబరు 19న చెన్నై ప్రారంభ మ్యాచ్​ ముంబయితో ఆడనుంది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
  • 3 వేల పాటలు పాడి రూ.85 లక్షల విరాళం సేకరణ
    ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద.. గత ఆరునెలల్లో దాదాపు 3 వేల ఆడియోలు రికార్డు చేసి శ్రోతలకు షేర్​ చేశారు. తద్వారా వచ్చిన రూ.85 లక్షల విరాళాన్ని కరోనా బాధితుల కోసం వినియోగించనున్నారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.