- రాష్ట్రంలో 1933 కరోనా కేసులు.
రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 1933 కరోనా కేసులు నమోదయ్యాయి. 19 మంది మరణించారు. మొత్తం బాధితుల సంఖ్య 29 వేల 168కి చేరుకోగా... మృతుల సంఖ్య 292కి పెరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- జగన్‌ది ఇల్లా.. మాయా మహలా?
ముఖ్యమంత్రి జగన్‌పై తెదేపా నేతలు అయ్యన్నపాత్రుడు, బుద్ధా వెంకన్న విమర్శలు గుప్పించారు. ప్రజాధనంతో వృథా ఖర్చులు చేయడం మాని.. ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని సూచించారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- భూమి చైనా పాలైంది..
మోదీ సర్కార్ హయాంలో.. పవిత్ర భారత భూభాగాన్ని (గల్వాన్ లోయ) చైనా ఆక్రమించుకుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఓ రక్షణ నిపుణుడి వ్యాఖ్యలను ఉటంకిస్తూ, గల్వాన్ లోయ నుంచి చైనా తన బలగాలను ఉపసంహరించుకోలేదని, మోదీ ప్రభుత్వం ఈ విషయంలో మీడియాను తప్పుదోవ పట్టిస్తోందని పేర్కొన్నారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- త్వరలో నిర్ణయం..
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కచ్చితంగా జరుగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి స్పష్టం చేశారు. వీటిని ఎప్పుడు నిర్వహించాలన్నదానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- బొమ్మకు పోస్ట్‌మార్టం..!
మహారాష్ట్రలో ఓ 'బొమ్మ' మృతికి కారణాలేంటో తెలుసుకోవడానికి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. వైద్యులు ఆ 'బొమ్మ'కు పోస్టుమార్టం నిర్వహించారు. అప్పుడే మరి, అసలు సంగతి బయటపడింది. 'బొమ్మ' మృతి చెందడమేంటి.. పోస్ట్‌మార్టం చేయడమేంటి అనుకుంటున్నారా? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మలాలా డే..
13 ఏళ్లకే తాలిబన్ల తూటాలకు గాయపడినా.. మనోధైర్యంతో నిలబడిన యువతి మలాలా. ప్రస్తుతం పిల్లలు, బాలికల హక్కుల కోసం విశేషంగా కృషి చేస్తోంది. అందుకే ఈమె చేస్తున్న సేవలను గుర్తించిన ఐకరాజ్యసమితి.. ఆమె పుట్టినరోజు(జులై 12)ను మలాలా దినోత్సవంగా ప్రకటించింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆయన కోసం చైనా ప్రార్థనలు...
ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలవాలని చైనా బలంగా కోరుకుంటున్నట్టు ఓ నివేదిక తెలిపింది. ట్రంప్ మరోమారు అధ్యక్ష బాధ్యతలు చేపడితే.. తమకే ఉపయోగం అని చైనా భావిస్తున్నట్టు తెలిపింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అంత సులువుగా వదులుకోదు..
టీ20 ప్రపంచకప్‌ను ఐసీసీ, వదులుకునేందుకు సిద్ధంగా లేదని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ అభిప్రాయపడ్డారు. జరిపేందుకు తన వంతు ప్రయత్నం చేస్తోందని తెలిపారు. అందుకే ఐపీఎల్‌పై ఏ నిర్ణయం తీసుకోలేదని అన్నారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- హెలికాప్టర్ షాట్ వీడియో వైరల్.
బాలీవుడ్ నటుడు సుశాంత్ ఆత్మహత్యను ఇంకా అభిమానులు మర్చిపోలేకపోతున్నారు. అతడికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ సుశాంత్‌ను గుర్తుచేసుకుంటున్నారు. తాజాగా ఓ సందర్భంలో అతడు బాదిన హెలికాప్టర్ షాట్ వీడియో వైరల్‌గా మారింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కైఫ్ అరుదైన ఘనత..
బాలీవుడ్ ముద్దుగుమ్మ కత్రినా కైఫ్ ఇన్‌స్టాగ్రామ్‌లో 40 మిలియన్ల ఫాలోవర్స్‌ను దక్కించుకుంది. ఈ సందర్భంగా అభిమానులకు ధన్యవాదాలు తెలిపిందీ హీరోయిన్. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.