ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9PM - ఏపీ వార్తలు

..

top news in andhrapradesh
top news in andhrapradesh
author img

By

Published : Feb 12, 2022, 8:57 PM IST

  • ప్రత్యేక హోదా అంశం తొలగింపు

ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రం మరోసారి మొండిచేయి చూపింది. ఈనెల 17న జరిగే సమావేశ అజెండాలో ప్రత్యేక హోదా అంశాన్ని ఉంచి.. ఈ ఉదయం ఇరు రాష్ట్రాలను చర్చలకు ఆహ్వానించిన కేంద్రం.. దాన్ని వెనక్కు తీసుకుంది. కేంద్ర హోంశాఖ ఈ ఉదయం జారీ చేసిన అజెండాలో.. మార్పులు చేసింది. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి.

  • ఎక్కడకు రావాలి: కేంద్రమంత్రి అఠావలే

మూడు రాజధానుల అంశంపై కేంద్రమంత్రి రాందాస్ అఠావలే కీలక వ్యాఖ్యలు చేశారు. వైకాపా ప్రభుత్వం మూడు రాజధానులు అంటోందని.., మూడు చోట్ల రాజధానులు పెడితే ఎక్కడకు రావాలి? అని ప్రశ్నించారు. ప్రస్తుతం ఒక్క రాజధాని కూడా అభివృద్ధి కావటం లేదన్నారు.పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి.

  • సీఎం జగన్​కు చంద్రబాబు వార్నింగ్ !

తెలుగుదేశం నాయకుల్ని వేధిస్తున్న ముఖ్యమంత్రి జగన్‌.. రేపు అనేది ఒకటి ఉంటుందనే విషయం మర్చిపోవొద్దని చంద్రబాబు హెచ్చరించారు. సీఐడీ కేసులో బెయిల్‌పై విడుదలైన పార్టీ ఎమ్మెల్సీ అశోక్ బాబును.. చంద్రబాబు పరామర్శించారు. అశోక్‌బాబు ఇంటికి వెళ్లి సీఐడీ అరెస్టు తదనంతర పరిణామాలపై ఆరా తీశారు. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి.

  • రూ.850 కోట్ల విలువైన గంజాయి దహనం..

విశాఖ జిల్లా అనకాపల్లి మండలం కోడూరులో 2 లక్షల కేజీల గంజాయిని పోలీసులు దహనం చేశారు. దీని విలువ 850 కోట్ల రూపాయలుగా ఉంటుందని తెలిపారు. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి.

  • ఒకే డ్రెస్​కోడ్ నిబంధన!'

Common dress code Supreme Court: విద్యా సంస్థల్లో డ్రెస్​కోడ్ నిబంధన అమలయ్యేలా చూడాలని సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. డ్రెస్​కోడ్ వల్ల విద్యార్థుల్లో సమానత్వం, సోదరభావం పెంపొందించినట్లు అవుతుందని పేర్కొంది. మరోవైపు, కళాశాలలకు సెలవులు పొడగిస్తూ కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి.

  • మణిపుర్​ పీఠం ఎవరిది?

Manipur election 2022: ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌లో పోలింగ్‌ తేదీలు దగ్గర పడుతున్నకొద్దీ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. పోలింగ్ శాతం తక్కువగా ఉండే మణిపుర్​లో.. తుది ఫలితాలను ఊహించడం కష్టమే. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఇటు భాజపా, అటు కాంగ్రెస్‌ పార్టీ రెండూ నమ్మకంగా చెబుతున్నాయి. వీటితో పాటు మరికొన్ని పార్టీలు బరిలో ఉన్నాయి. మొత్తంగా అక్కడి రాజకీయ పరిస్థితి ఎలా ఉందంటే.. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి.

  • 'అద్దెకు బాయ్​ఫ్రెండ్'​..

Boy Friend On Rent Bihar: 'అద్దెకు బాయ్​ఫ్రెండ్​' బిహార్​లోని దర్భంగాలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ ప్లకార్డులతో ఓ యువకుడు దర్శనమిస్తున్నాడు. నగరంలోని ప్రతి ప్రాంతంలో ఈ ప్లకార్డును ప్రదర్శిస్తూ తిరుగుతున్నాడు. మరి ఆ యువకుడు ఎవరు? అతడు ఎందుకు అలా చేస్తున్నాడు..? పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి.

  • రాహుల్ బజాజ్ కన్నుమూత..

Rahul Bajaj passed away: ప్రముఖ పారిశ్రామికవేత్త, బజాజ్ గ్రూప్ గౌరవ ఛైర్మన్ రాహుల్ బజాజ్ కన్నుమూశారు. 83 ఏళ్ల వయసులో ఆయన తుది శ్వాస విడిచారు. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి.

  • 'డీజే టిల్లు' మోతమోగించాడా?

DJ Tillu Review: ఇటీవల కాలంలో యూత్​లో బాగా క్రేజ్​ సంపాదించుకున్న సినిమా 'డీజే టిల్లు'. డైలాగులు, ప్రచార చిత్రాలతో సినిమాపై ఆసక్తిని కలిగించారు మేకర్స్​. మరి శనివారం థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఎంతమేర ఆకట్టుకుందో తెలుసుకోండి. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి.

  • శ్రేయస్‌ను అధిగమించిన ఇషాన్‌ కిషన్‌.. ఆల్‌రౌండర్లకు భారీ డిమాండ్

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ మెగా వేలం ఉత్కంఠభరితంగా సాగుతోంది. గత వేలంలో తక్కువ మొత్తం పొందిన కొందరు క్రికెటర్లు ఈసారి భారీ ధరను సొంతం చేసుకుని రికార్డులు సృష్టిస్తున్నారు.పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.