ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 1 PM - ఆంధ్రప్రదేశ్ ప్రధాన వార్తలు

.

top news etv bharat
ప్రధాన వార్తలు @ 1 PM
author img

By

Published : Jul 28, 2020, 1:01 PM IST

  • 'కరోనాను జయించటమే ప్రతిఒక్కరి ధ్యేయం కావాలి'

కరోనాను జయించటమే ప్రతిఒక్కరి ధ్యేయం కావాలని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. కరోనా సమయంలో అంతా సమైక్యంగా ఉండి రాజకీయాలకు అతీతంగా పనిచేయాలన్నారు. ప్రజల తరపున తెలుగుదేశం పార్టీ పరంగా ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లు, సూచనలు ఉంచారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చెయ్యండి.

  • ఈటీవీ భారత్ కథనానికి స్పందన.. ఉప్పు ఎగుమతులకు అధికారుల అనుమతి

కరోనా కష్టకాలంలో ఉప్పు పరిశ్రమ వేలాది మంది కూలీలను అదుకుంటోంది. లాక్ డౌన్ నిబంధనల కారణంగా కూలీలకు జీవనోపాధి కూడా కష్టంగా మారటంతో... వారు పడుతున్న ఇబ్బందులు... ఏప్రిల్ 18న " కరోనా దెబ్బతో నష్టపోతున్న ఉప్పు రైతులు" ఈటీవీ జైకిసాన్, ఈటీవీ భారత్ లలో కథనం ప్రసారమైంది. దీంతో అధికారులు స్పందించి ఉప్పు ఎగుమతులకు అనుమతులిచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చెయ్యండి.

  • ఏఓబీలో మావోయిస్టుల అమ‌ర‌వీరుల వారోత్సవాలు..పోలీసుల కూంబింగ్ ముమ్మరం

ఆంధ్రా - ఒడిశా సరిహద్దుల్లో జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు మావోయిస్టు అమ‌ర‌వీరుల వారోత్సవాలు నిర్వ‌హించ‌నుండ‌టంతో స‌రిహ‌ద్దుల్లో ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. అగ్ర నాయకులు సరిహద్దులకు చేరుకున్నారన్న సమాచారంతో పోలీసులు కూంబింగ్ ముమ్మరం చేశారు. దీంతో సరిహద్దు ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చెయ్యండి.

  • హుండీ ఆదాయం రూ.50 లక్షలే!

కరోనా ప్రభావం శ్రీవారి హుండీ ఆదాయంపై పడింది. సాధారణ రోజుల్లో రోజుకు రూ.3 కోట్లు వచ్చే హుండీ ఆదాయం.. ప్రస్తుతం రూ.50 నుంచి రూ.60 లక్షలు మాత్రమే వస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చెయ్యండి.

  • శాస్త్రీయ పరిశోధనలకు భారత్​-బ్రిటన్​ మధ్య ఒప్పందం

యాంటీ మైక్రాబియల్​ రెసిస్టెన్స్​ పరిశోధనలకు సంబంధించి ఐదు కీలక ప్రాజెక్టులను జరపనున్నాయి భారత్​-బ్రిటన్​. ఈ పరిశోధనల విలువ 8 మిలియన్​ పౌండ్లగా బ్రటీష్​ హై కమిషన్​ ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చెయ్యండి.

  • కాంగ్రెస్​పై మాయ ఫైర్.. ఎమ్మెల్యేల విలీనంపై కోర్టుకు!

రాజస్థాన్ రాజకీయం రసకందాయంలో పడింది. తమ సభ్యులను అనైతికంగా విలీనం చేసుకున్నారని ఆరోపిస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు ప్రకటించింది బీఎస్పీ అధినేత్రి మాయవతి. ఈ నేపథ్యంలో రాజస్థాన్ రాజకీయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చెయ్యండి.

  • వరద ధాటికి కూలిన వంతెనలు.. ముగ్గురు మృతి

ఉత్తరాఖండ్​లో కుండపోత వర్షాల వల్ల వరదలు పోటెత్తుతున్నాయి. ఫలితంగా పితోర్​గఢ్​ జిల్లాలో గోసీ నదిపై ఉన్న రెండు వంతెనలు కూలిపోయాయి. ముగ్గురు మరణించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చెయ్యండి.

  • చైనా బాగోతం బట్టబయలు- వుహాన్ మార్కెట్లో ఆధారాలు ధ్వంసం

కొవిడ్ గురించి ప్రపంచానికి సమాచారం అందించడంలో చైనా అలసత్వం ప్రదర్శించిందన్న ఆరోపణలకు మరో ఆధారం లభించింది. వైరస్​ను తొలి దశలో గుర్తించిన హాంకాంగ్​కు చెందిన డాక్టర్ ఈ విషయంపై పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. వుహాన్​ మార్కెట్​లో వైరస్ గురించి దర్యాప్తు చేసేందుకు వెళ్లగా.. అప్పటికే అక్కడ ఆధారాలను నాశనం చేశారని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చెయ్యండి.

  • 'ఎక్కడైనా పరుగెత్తుతా.. ఒలింపిక్స్​కు అర్హత సాధిస్తా'

ఏ టోర్నీకి ఎంపిక చేసినా సరే పరుగెత్తేందుకు సిద్ధమని అంటోంది స్టార్​ అథ్లెట్​ హిమదాస్​. టోక్యో ఒలింపిక్స్​కు అర్హత సాధించడమే తన లక్ష్యమని చెప్పింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చెయ్యండి.

  • ప్రముఖ నటుడు 'కిక్'​ శ్యామ్ అరెస్ట్

ప్రముఖ నటుడు శ్యామ్​ను గ్యాంబ్లింగ్​ కేసులో చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. 'కిక్​' సినిమాలో తెలుగునాట ఇతడు గుర్తింపు తెచ్చుకున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చెయ్యండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.