- గుడ్‌న్యూస్.. వేగంగా నైరుతి రుతుపవనాల పయనం.. రెండ్రోజుల్లో కేరళకు..
మే 20 నుంచి స్తబ్దుగా ఉన్న నైరుతి రుతుపవనాలు.. వేగం పుంజుకున్నాయి. దక్షిణ శ్రీలంకను పూర్తిగా కమ్మేశాయి. మరో రెండ్రోజుల్లో కేరళకు చేరుకోనున్నాయి. ఇప్పటికే దక్షిణ భారతదేశంలో సాధారణం కంటే అధిక వర్షాలు కురిశాయి.
- ఎన్నికలు ఎప్పుడు జరిగినా.. జగన్ ఇంటికే : చంద్రబాబు
ఎన్నికలు ఎప్పుడు జరిగినా.. జగన్ ఇంటికి పోవడం ఖాయమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఒంగోలులో జరగనున్న తెలుగుదేశం మహానాడుకు పార్టీ అధినేత చంద్రబాబు బయల్దేరారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయం నుంచి నేతలు, కార్యకర్తలతో కలిసి ర్యాలీగా తరలివెళ్లారు.
- మాజీ మంత్రి నారాయణపై.. చర్యలు తీసుకోవద్దు: హైకోర్టు
మాజీ మంత్రి నారాయణకు హైకోర్టులో ఊరట లభించింది. నారాయణపై ఎలాంటి చర్యలూ తీసుకోవద్దని న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతి రింగ్ రోడ్డు భూ సమీకరణలో అక్రమాలు జరిగాయంటూ మంగళగిరి వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు.. సీఐడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
- వర్షం అడ్డంకి.. విజయనగరంలో 'సామాజిక న్యాయభేరి' బహిరంగ సభ రద్దు
Samajika Nyaya Bheri Sabha Cancelled: మంత్రుల బస్సుయాత్రలో భాగంగా విజయనగరంలో తలపెట్టిన భారీ బహిరంగ సభ వర్షం కారణంగా ఆగిపోయింది. సభకు భారీ వర్షం ఆటంకం కలిగించడంతో సభను మంత్రులు రద్దు చేశారు.
- తెలంగాణలో అడుగుపెట్టగానే ఆ విషయం అర్థమైంది : ప్రధాని మోదీ
Modi in Hyderabad: తెలంగాణ గడ్డపై అడుగుపెట్టగానే ఇక్కడి గాలి కాషాయంవైపే వీస్తోందనే విషయం అర్థమైందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇక్కడి ప్రజల్లో మార్పు మొదలైందని తెలిపారు. తెలంగాణ గడ్డపై భాజపా జెండా ఎగరడం ఖాయమనిపిస్తోందని చెప్పారు. బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న మోదీకి భాజపా శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. అనంతరం ఎయిర్పోర్ట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్వాగత సభలో మోదీ ప్రసంగించారు.
- మెకానిక్‌లా వచ్చి ఆర్టీసీ బస్సు చోరీ.. సీసీటీవీ దృశ్యాలు వైరల్
KSRTC Bus stolen: ఆర్టీసీ బస్టాండ్ నుంచే బస్సును చోరీ చేశాడు ఓ వ్యక్తి. కేరళ ఎర్నాకులంలోని అలువ ప్రాంతంలో ఉదయం 8.20కి జరిగిందీ ఘటన. సీసీటీవీలో ఈ దృశ్యాలు నమోదయ్యాయి. మెకానిక్ వేషంలో వచ్చిన దొంగ.. అలువ నుంచి కోజికోడ్ వెళ్లాల్సిన బస్సును చోరీ చేసుకొని వెళ్లాడు.
- దారుణం.. ఆస్పత్రిలో షార్ట్ సర్క్యూట్.. 11 మంది చిన్నారులు మృతి
ఓ ఆస్పత్రిలో జరిగిన అగ్నిప్రమాదంలో 11 మంది నవజాత శిశువులు మరణించారు. ఆఫ్రికన్ దేశమైన సెనెగల్‌లోని టివయూనే పట్టణంలో జరిగిందీ ఘటన.
- ట్విట్టర్‌తో 'డోర్సే' కటీఫ్.. మస్క్‌కు తేల్చిచెప్పిన మాజీ సీఈఓ!
Jack Dorsey Steps Down Twitter: ట్విట్టర్ సహ-వ్యవస్థాపకుడు, మాజీ సీఈఓ జాక్ డోర్సే.. సంస్థ బోర్డు నుంచి వైదొలిగారు. డైరెక్టర్‌గా పదవీకాలం ముగియగా.. ట్విట్టర్ నుంచి పూర్తిగా తప్పుకున్నట్లయింది. మరోవైపు.. యూజర్ల డేటాను కాపాడటంలో విఫలమైందని ట్విట్టర్‌కు రూ. 11 వేల కోట్ల జరిమానా విధించాయి యూఎస్ జస్టిస్ డిపార్ట్మెంట్, ఫెడరల్ ట్రేడ్ కమిషన్.
- రాహుల్ బ్యాటింగ్‌పై శాస్త్రి విమర్శలు.. 'అస్సలు అర్థం కాలేదంటూ..'
KL Rahul Ravisastri: ఐపీఎల్ 15వ సీజన్లో గతరాత్రి బెంగళూరుతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో లఖ్‌నవూ ఓటమిపాలై ఇంటిబాట పట్టింది. అయితే ఈ మ్యాచ్‌లో లఖ్‌నవూ ఆటతీరుపై టీమ్ఇండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. జట్టు సారథి రాహుల్ ఆటతీరును విమర్శలు గుప్పించాడు. అతడి ఆట తనకు అర్థం కాలేదని పేర్కొన్నాడు.
- బాప్రే.. కళ్లు చెదిరే అందాలన్నీ కరణ్ బర్త్‌డే పార్టీలోనే!
Karan johar birthday party: బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ బుధవారం(మే 25న) 50వ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సెలబ్రిటీలకు గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు పలువురు స్టార్ హీరోహీరోయిన్లు విచ్చేసి సందడి చేశారు. వీరిలో జాన్వీ, మలైకా, కియారా, రష్మిక సహా పలువురు ముద్దుగుమ్మలు ఉన్నారు.