- పంచాయతీ పోరు: మధ్యాహ్నం 12.30 గంటల వరకు 62.02 శాతం పోలింగ్
తొలి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 12.30 గంటల వరకు 62.02 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
- ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను ఒప్పుకునేది లేదు: మంత్రి ముత్తంశెట్టి
మన పూర్వీకుల ప్రాణ త్యాగాలతో సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకొనేది లేదని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
- రాష్ట్రంలో శాంతిభద్రతల విఘాతంపై.. కేంద్ర హోం శాఖకు తెదేపా ఫిర్యాదు
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రస్తుత పరిస్థితులపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాను కలిసి ఫిర్యాదు చేసినట్లు తెదేపా ఎంపీలు గల్లా జయదేవ్, కనకమేడల తెలిపారు. ఆలయాలపై దాడులు, శాంతిభద్రతల విఘాతం, దాడులు వంటి పలు అంశాలను వివరించినట్టు చెప్పారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
- తెలంగాణలో వైఎస్ లేని లోటు కనిపిస్తోంది: షర్మిల
తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తానని ఏపీ ముఖ్యమంత్రి సోదరి వైఎస్ షర్మిల అన్నారు. తెలంగాణలో వైఎస్సార్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు. హైదరాబాద్ లోటస్‌పాండ్‌లో అభిమానులు, వైకాపా నేతలతో షర్మిల సమావేశమయ్యారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
- జోరుగా ఆపరేషన్ ఉత్తరాఖండ్: అమిత్ షా
ఉత్తరాఖండ్ విపత్తుపై రాజ్యసభలో ప్రకటన చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ప్రస్తుతం వరద ముప్పు తొలిగిపోయిందని తెలిపారు. ఐటీబీపీ, సైన్యం, నౌకాదళానికి చెందిన బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమైనట్లు వెల్లడించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
- హిందుస్థానీ ముస్లింగా గర్వపడుతున్నా: ఆజాద్
పాకిస్థాన్ పరిస్థితుల గురించి చదివినప్పుడు తాను భారత ముస్లింగా గర్వపడతానని చెప్పారు కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్. తన రాజకీయ జీవితంలో ఎంతో నేర్చుకున్నట్లు రాజ్యసభలో పదవీ విరమణకు ముందు చేసిన ప్రసంగంలో తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
- ప్రపంచ పౌరసత్వ రాయబారిగా శ్రీ శ్రీ రవిశంకర్
ఆధ్యాత్మికవేత్త శ్రీ శ్రీ రవిశంకర్‌ను ప్రపంచ పౌరసత్వ రాయబారిగా గుర్తించింది అమెరికాకు చెందిన ఓ విశ్వవిద్యాలయం. ప్రసంగాలు, వ్యూహాత్మక కార్యక్రమాల ద్వారా శాంతిని పెంపొందించేందుకు ఆయన కృషి చేశారని కొనియాడింది. అనేక దేశాల్లో సమస్యలకు పరిష్కారం చూపారని తెలిపింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
- ఖాతాల వేటుపై కేంద్రంతో ట్విట్టర్ చర్చలు
1,178 ట్విట్టర్ ఖాతాలపై వేటు వేయాలన్న ప్రభుత్వ ఆదేశాలపై కేంద్ర ఐటీ మంత్రితో అధికారిక చర్చలు జరుపుతున్నట్లు సంస్థ తెలిపింది. రైతు నిరసనలపై దుష్ప్రచారం చేస్తున్నాయని.. ఈ ఖాతాలపై నిషేధం విధించాలని కేంద్రం కోరింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
- తొలి టెస్ట్: ఇంగ్లాండ్ విజయం- సిరీస్‌లో 1-0 ఆధిక్యం
చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్ భారీ విజయం సాధించింది. టీమ్ఇండియాను రెండో ఇన్నింగ్స్‌లో 192 పరుగులకు ఆలౌట్ చేసి 227 పరగుల తేడాతో గెలుపొందింది. జాక్ లీచ్, అండర్సన్‌లు తమ జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
- 'అర్జున్ రెడ్డి' కాంబో మరోసారి.. నెట్టింట జోరుగా చర్చ!
టాలీవుడ్లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన చిత్రం 'అర్జున్ రెడ్డి'. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా నటించగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించాడు. కాగా, ఈ కాంబో మరోసారి అలరించడానికి సిద్ధమైందట. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.