- భారత్‌కు బయలుదేరిన రఫేల్ యుద్ధ విమానాలు
- మృతదేహాలతో నిండిపోయిన గుంటూరు జీజీహెచ్ మార్చురీ
రఫేల్ యుద్ధవిమానాలు మరో రెండు రోజుల్లో భారత అమ్ముల పొదిలోకి చేరుకోనున్నాయి. ఫ్రాన్స్‌లోని మారిగ్నాక్ వైమానిక స్థావరం నుంచి ఐదు యుద్ధ విమానాలు ఇవాళ టేకాఫ్ అయ్యాయి. బుధవారం నాటికి భారత్‌లోని అంబాలా వైమానిక స్థావరానికి అవి చేరుకుంటాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
గుంటూరు జీజీహెచ్ మార్చురీ మృతదేహాలతో నిండిపోయింది. మృతదేహాలకు పరీక్షలు చేయాలన్న నిబంధన, పరీక్షల ఫలితాలు ఆలస్యం కావడం వల్ల పంచనామా జాప్యమవుతోంది. పరీక్ష ఫలితాలు వేగవంతం చేయాలని మృతుల బంధువులు, కుటుంబ సభ్యులు కోరుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మృతదేహం 10 గంటలకుపైగా వార్డులోనే...
అనంతపురం సర్వజనాసుపత్రిలో దయనీయ ఘటన జరిగింది. 50 ఏళ్ల మహిళ కరోనా అనుమానిత లక్షణాలతో ఆసుపత్రిలో చేరి ఎఫ్‌ఎం వార్డులో చికిత్స పొందుతున్నారు. ఆదివారం ఉదయం ఆమె చనిపోయినట్లు పక్కన ఉన్న రోగులు గుర్తించారు. కానీ ఆమె మరణించినట్లు రాత్రి వరకూ వైద్య సిబ్బందికి తెలియదు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కేసులు లక్షదాటుతుంటే ఏం చేస్తున్నారు?: దేవినేని ఉమ
రాష్ట్రలో కరోనా కేసులు లక్ష దాటుతుంటే ప్రభుత్వ ఏం చర్యలు తీసుకుంటోందని మాజీ మంత్రి దేవినేని ఉమా నిలదీశారు. గుంటూరు జీజీహెచ్ లో 30కి పైగా మృతదేహాలు అనాథ శవాలుగా ఉండటం దారుణమన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రాష్ట్రపతికి పదో తరగతి కుర్రాడు లేఖ.. ఎందుకంటే?
కరోనా సహా సముద్ర కోత వంటి సమస్యలతో బాధపడుతున్న తమ గ్రామాన్ని ఆదుకోవాలని రాష్ట్రపతికి లేఖ రాశాడు కేరళకు చెందిన ఓ కుర్రాడు. సముద్ర తీరంలో గోడ కట్టించి తమను కాపాడాలని అభ్యర్థించాడు. ఎవరూ తమకు సాయం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
బిహార్ తూర్పు చంపారన్ జిల్లాలోని గోబరి గ్రామం వరదల్లో చిక్కుకుంది. ఆ గ్రామంలోని ఓ గర్భిణీకి ప్రవస వేధన మొదలైన నేపథ్యంలో ఆమెను మోటారు బోటులో ఆసుపత్రికి తరలించడానికి ఎన్డీఆర్ఎఫ్ బృందం నిర్ణయించింది. కానీ మార్గం మధ్యలోనే ఆ మహిళ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- చైనాకు మళ్లీ ఝలక్.. పబ్జీ సహా 280యాప్‌లపై నిషేధం!
ఇప్పటికే 59చైనా యాప్స్‌ను నిషేధించిన భారత ప్రభుత్వం.. మరికొన్నింటిపై ఆంక్షలు విధించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈసారి పబ్జీ సహా 280 చైనా యాప్‌లను నిషేధించే అవకాశముంది. ఇందుకు ఐటీశాఖ అధికారులు ఇప్పటికే పనులు మొదలుపెట్టినట్టు సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సుడాన్లో భీకర వర్గ పోరు.. 60మంది మృతి
సుడాన్‌లోని మస్తేరీ గ్రామంలో రెండు వర్గాల మధ్య భీకర పోరు జరిగింది. ఈ ఘటనలో 60మంది మృతిచెందారు. మరో 60మంది తీవ్రంగా గాయపడటం వల్ల మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ఘర్షణల్లో అనేక ఇళ్లను దోచుకుని తర్వాత వాటికి నిప్పు అంటించారు దుండగులు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- టెన్నిస్‌ను కెరీర్‌గా ఎంచుకోవాలనుకున్నా- యువరాజ్ సింగ్
క్రికెటర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువరాజ్ సింగ్.. ఒకప్పుడు టెన్నిస్‌ను తన కెరీర్‌గా ఎంచుకోవాలనుకున్నట్లు తెలిపాడు. ఇటీవలె ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఆర్చరీ క్రీడాకారుడుగా నాగశౌర్య ఫస్ట్‌లుక్ ఇదే!
టాలీవుడ్ హీరో నాగశౌర్య కొత్త చిత్రం నుంచి ఫస్ట్‌లుక్ విడులైంది. ఆ స్టిల్‌లో కండలు తిరిగిన దేహం, గుబురు గడ్డం, జట్టు ముడివేసుకొని గంభీరంగా కనిపిస్తున్నాడు. సినిమాకు సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తుండగా.. ఆర్చరీ క్రీడా నేపథ్యంలో సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.