చిరు వ్యాపారులు, తోపుడు బళ్ల వారికి ఆర్థిక సాయం అందించే 'జగనన్న తోడు' పథకాన్ని ముఖ్యమంత్రి జగన్ బుధవారం ప్రారంభించనున్నారు. ఈ పథకంలో భాగంగా చిరు వ్యాపారులు ఒక్కొక్కరికి రూ.10 వేల రుణం అందించనున్నారు. పది లక్షల మంది లబ్ధిదారులకు జగనన్న తోడు పథకం కింద రుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు 6.40 లక్షల మంది చిరు వ్యాపారులను ప్రభుత్వం గుర్తించింది. ఇందులో 3.60 లక్షల దరఖాస్తుల్ని ఇప్పటికే వివిధ బ్యాంకులకు అధికారులు పంపించారు. లబ్ధిదారులైన చిరు వ్యాపారులకు గుర్తింపు కార్డులు జారీ చేయనున్నారు.
మరోవైపు జగనన్న తోడు పథకం ప్రారంభించేందుకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ మంత్రులకు ఆహ్వానం పంపించారు. కొండపల్లి బొమ్మలతో ఆహ్వాన పత్రాలు రూపొందించారు.
ఇదీ చదవండి: