ETV Bharat / city

OMICRON Cases In Telangana: తెలంగాణలో మరో ఒమిక్రాన్ కేసు.. 8కి చేరిన కేసులు - తెలంగాణలో మరో ఒమిక్రాన్ కేసు

Today Omicron Cases in Telangana: తెలంగాణలో రోజురోజుకూ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా మరొకరికి ఒమిక్రాన్ సోకినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. కానీ ఇప్పటివరకూ ఒమిక్రాన్‌ సామూహిక వ్యాప్తి లేదని ఆ రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు​ శ్రీనివాసరావు తెలిపారు. నాన్​ రిస్క్ దేశాల నుంచి వచ్చిన ఏడుగురికి ఒమిక్రాన్ సోకిందని తెలిపారు.

today Omicron Cases in Telangana
today Omicron Cases in Telangana
author img

By

Published : Dec 17, 2021, 1:32 PM IST

Omicron Cases in Telangana: తెలంగాణలో తాజాగా మరొకరికి ఒమిక్రాన్ సోకినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్యం 8కి చేరిది. ఈ మేరకు రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు​ శ్రీనివాసరావు తెలిపారు.

దేశంలో 11 రాష్ట్రాల్లో 88 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో 8 కేసులు నిర్ధరణయ్యాయి. హనుమకొండకు చెందిన మహిళకు ఒమిక్రాన్ నిర్ధరణైంది. కరోనా మూడో దశను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. మొత్తం 90 దేశాల్లో ఒమిక్రాన్ వ్యాప్తి ఉంది. ఒమిక్రాన్ వేరియంట్ పట్ల భయాందోళన చెందొద్దు. వైరస్ సోకిన బాధితుల్లో 95 శాతం మందిలో లక్షణాలు కనిపించట్లేదు. దేశంలోని ఒమిక్రాన్ బాధితుల్లో ఒకరిద్దరే ఆస్పత్రుల్లో చేరారు. ఒమిక్రాన్‌తో ప్రాణాపాయం లేదు. ఒమిక్రాన్‌ను ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో ఇప్పటివరకు ఒక్క ఒమిక్రాన్ మరణమే నమోదైంది. ఒమిక్రాన్ పట్ల అనవసర భయాందోళన అవసరంలేదు. భవిష్యత్‌లో మరో 10 కొత్త వేరియంట్లు వచ్చే అవకాశం ఉంది. వ్యాక్సిన్ తీసుకోకపోవడమే కూడా వ్యాప్తికి కారణం. రాష్ట్రంలో 97 శాతం మంది మొదటి డోసు తీసుకున్నారు. 11 జిల్లాల్లో వందశాతం మొదటి డోసు, 56 శాతం మంది రెండు డోసులు తీసుకున్నారు. -శ్రీనివాసరావు, డీహెచ్, తెలంగాణ

OMICRON In Telangana: కరోనా లక్షణాలు కనిపిస్తే పరీక్షలు చేయించుకోవాలని డీహెచ్ శ్రీనివాసరావు సూచించారు. ఇంటా బయటా మాస్కు ధరించాలన్నారు. వ్యాక్సిన్ తీసుకోకపోవడం వల్లనే ఒమిక్రాన్ వ్యాపిస్తోందని తెలిపారు. లాక్‌డౌన్ పెడతారన్న దుష్ప్రచారాలను నమ్మవద్దని.. కానీ ప్రజలంతా బాధ్యతగా కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.