ETV Bharat / city

Today Break to Amaravathi Padayatra: నెల్లూరులో అద్వితీయంగా కొనసాగిన పాదయాత్ర.. నేడు యాత్రకు విరామం - నిర్విరామంగా అమరావతి రైతుల పాదయాత్ర

Amaravathi Padayatra: అమరావతి రైతుల మహాపాదయాత్ర నెల్లూరు జిల్లాలో అద్వితీయంగా కొనసాగుతోంది. అన్నదాతలకు అడుగడుగునా అపూర్వ స్వాగతం లభిస్తోంది. 27వ రోజు జరుగుతున్న యాత్రకు మేము సైతం అంటూ అన్ని వర్గాల ప్రజలు... రైతులకు అండగా పాదం కదిపారు. జోరువానలోనూ సడలని సంకల్పంతో అన్నదాతలు ముందుకు కదిలారు. నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలుంటాయన్న వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో యాత్రకు నేడు(28వ రోజు) విరామం(today break to maha padayatra) ప్రకటించారు.

Maha Padayatra 28th Day Rest
మహాపాదయాత్రకు నేడు విరామం
author img

By

Published : Nov 28, 2021, 4:24 AM IST

Updated : Nov 28, 2021, 6:16 AM IST

నెల్లూరులో అద్వితీయంగా కొనసాగిన పాదయాత్ర.. నేడు యాత్రకు విరామం

Today Break to Amaravathi Padayatra: ఏకైక రాజధానిగా అమరావతిని నిలుపుకోవాలన్న సంకల్పంతో రైతులు చేపట్టిన పాదయాత్ర అన్ని ప్రాంతాలనూ కదిలిస్తోంది. నెల్లూరులో అన్నదాతలకు మద్దతు తెలిపేందుకు జనం పోటెత్తారు. న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరిట రైతుల చేపట్టిన మహాపాదయాత్ర నెల్లూరు నగర వాసులంతా మమేకమయ్యారు. బడికి వెళ్లే చిన్నారులు మొదలుకొని.. 60 ఏళ్ల వృద్ధుల వరకు సంఘీభావంగా రోడ్డెక్కారు. రాజకీయ పార్టీలు, న్యాయవాదులు, వడ్డెర సంక్షేమ సంఘం, ప్రజాసంఘాలు సైతం కాలు కదిపాయి. పాదయాత్రకు వర్షంతో అడుగడుగునా అడ్డంకులు ఎదురైనా.. అంకుఠిత దీక్షతో ముందుకు(Amaravathi Farmers Padayatra news) సాగారు.

ఓ వైపు భారీ వర్షం కురుస్తుండగా.. మరోవైపు రైతులపై పూల వర్షం కురిపించారు. జై అమరావతి నినాదాలతో నగరమంతా మార్మోగిపోయింది. రాళ్లు పడతాయని బెదిరించిన వాళ్లు.. పూల వర్షం కురిపిస్తున్న ప్రజా స్పందనను చూడాలని రాజధాని రైతులు అంటున్నారు. పెయిడ్ ఆర్టిస్టులుగా మీరు ఎగతాళి చేస్తే.. మంగళహారతులు పడుతూ తమ అకుంఠిత దీక్షకు మహాబాసటగా నిలుస్తున్న వైనాన్ని ప్రభుత్వం గ్రహించాలని వేడుకుంటున్నారు.

రైతుల పాదయాత్ర.. శనివారం ఉదయం పదిన్నర గంటలకు నెల్లూరులోని జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రం నుంచి ప్రారంభమైంది. మధ్యాహ్నం బారాషాహీద్‌ దర్గా వద్దకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. భోజన విరామం అనంతరం మళ్లీ నడక ప్రారంభించారు. అంబాపురం వద్ద పాదయాత్ర ముగియగా రాత్రికి శాలివాహన ఫంక్షన్‌ హాల్‌లో రైతులు బస చేశారు. శనివారం 12 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగింది. తిరుమల వరకు 435 కిలోమీటర్లు నడవాల్సి ఉండగా.. శనివారం నాటికి 300కిలో మీటర్ల మైలు రాయిని దాటారు. రైతుల దృఢ సంకల్పానికి ప్రభుత్వం దిగి వచ్చి అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగిస్తోందని మద్దతుదారులు ఆశాభావం వ్యక్తం చేశారు.

వలువురు విరాళాలు అందజేత..

అమరావతి రైతుల పాదయాత్రకు మేము సైతం అంటూ పలువురు విరాళాలను అందిస్తున్నారు. నెల్లూరు నగర తెదేపా ఇన్‌ఛార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి కుమారుడు కోటంరెడ్డి ప్రజయ్‌సేనారెడ్డి లక్ష రూపాయలు అందించారు. అనంతపురం కొత్తచెరువు మండలానికి చెందిన రైతులు 65 వేలు ఇలా అనేక మంది తమ వంతు సాయం చేస్తున్నారు. యాత్రకు వస్తున్న మద్దతును చూసైనా ప్రభుత్వం మూడు రాజధానులు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

యాత్రకు నేడు విరామం...

నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో.... పాదయాత్రకు నేడు విరామం(today break to maha padayatra) ప్రకటిస్తున్నట్లు అమరావతి ఐకాస నేతలు తెలిపారు. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో వరద బాధితులను ఆదుకునేందుకు తమ విరాళాల నుంచి ఒక్కో జిల్లాకు 5లక్షలు వంతున పంపుతున్నట్లు వెల్లడించారు. రాష్ట్రం మధ్యలో అమరావతి రాజధానిని కడితే అన్ని జిల్లాలు అభివృధ్ధి చెందుతాయన్నారు. యువత మూడు రాజధానుల మాయలో పడవద్దని కోరారు. అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించేంత వరకు ఉద్యమం ఆగదన్నారు. అనంతపురం, రాయలసీమలో మహాపాదయాత్రను తిరగనివ్వమని కొందరు చెప్పడం సిగ్గుచేటన్నారు.

ఇదీ చదవండి..

AMARAVATI FARMERS MAHA PADAYATRA IN NELLORE : వర్షంలోనూ ముందుకే.. 27వరోజు ముగిసిన రైతు మహాపాదయాత్ర

Last Updated : Nov 28, 2021, 6:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.