ETV Bharat / city

కరోనా ఎఫెక్ట్: ఒకే కుటుంబంలో పదిహేను రోజుల్లో ముగ్గురు మృతి - amaravathi news

గ్రామాలు వేరైనా ఆ కుటుంబాన్ని కొవిడ్ వెంటాడింది. పదిహేను రోజుల్లో ముగ్గురుని కబళించింది. ఆ కుటుంబానికి శోకాన్ని మిగిల్చింది. ఒకేసారి భర్తను, కూతురుని, మనవరాలిని కోల్పోయిన ఆ అవ్వ రోదన వర్ణనాతీతమైంది.

three people of same family died of corona
ఒకే కుటుంబంలో పదిహేను రోజుల్లో ముగ్గురు మృతి
author img

By

Published : May 20, 2021, 2:10 PM IST

తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలోని దర్పెల్లి మండలం వాడి గ్రామంలో సాయవ్వ, బాలగంగారం దంపతులు నివాసముంటున్నారు. వారికి ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. కుమార్తె లతను డిచ్​పెల్లి మండలానికి చెందిన శ్రీనివాస్​కు ఇచ్చి వివాహం చేశారు. లత కూతురు సంధ్యను ఇందల్వాయికి చెందిన రవికి ఇచ్చి పెళ్లిచేశారు.

ఈనెల 4వ తేదీని బాలగంగారం అనారోగ్యంతో మృతి చెందగా.. 14వ తేదీన లత కూతురు సంధ్య కరోనా చికిత్స పొందుతూనే మగ శిశువుకు జన్మనిచ్చి మృత్యువాతపడింది. కూతురు చనిపోయిన 5 రోజులకు వైరస్​తో లత సైతం తుది శ్వాస విడిచింది. మృతులు వేరే గ్రామాల్లో ఉంటున్నా.. అందరూ ఒకే కుటుంబానికి చెందినవారు కావటంతో బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.

ఇదీ చూడండి:

ఏకధాటిగా 12గంటలపాటు విచారించిన హైకోర్టు

విశాఖ: మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.