ETV Bharat / city

14 నెలలుగా... సెలవు లేకుండా వైరస్‌తో సహవాసం..! - కరోనా వార్తలు

కొవిడ్‌ వైరస్‌ కంటికి కానరాని శత్రువు. ప్రపంచాన్నే వణికిస్తున్న మహమ్మారి. వారు మాత్రం కళ్లారా చూస్తున్నారు. ప్రజలందరి భవిష్యత్తును భద్రంగా ఉంచేందుకు ప్రమాదపుటంచున ప్రయాణిస్తున్నారు. వైరస్‌పరంగా చోటుచేసుకొనే జన్యుపర మార్పులు, కొమ్ములతో విరుచుకుపడే స్వభావాన్ని అంచనా వేస్తున్నారు. ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ పరిశోధనలు సాగిస్తున్నారు సెంటర్‌ ఫర్‌ సెల్యులర్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ(సీసీఎంబీ) శాస్త్రవేత్తలు, పరిశోధక విద్యార్థులు. సెలవులు, పండగలు, లాక్‌డౌన్‌ అనే తేడా లేకుండా 14 నెలలుగా అలుపెరగక శ్రమిస్తున్నారు. వైరస్‌తోనే సహవాసం చేస్తున్నారు. మందులు, టీకాల తయారీకి కృత్రిమ వైరస్‌ను సృష్టించారు. కదలికలను సునిశితంగా పరిశీలిస్తున్నారు.

THE RELENTLESS RESEARCH OF CCMB YOUNG SCIENTISTS

author img

By

Published : May 7, 2021, 4:36 PM IST

కొవిడ్‌ తొలి దశలో నిర్ధారణ పరీక్షలు ఎలా చేయాలో తెలియని స్థితి. ఆ దశలో మొదటగా సీసీఎంబీలోనే రోజుకు వెయ్యి పరీక్షల సామర్థ్యంతో ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలు చేపట్టారు. ఆనాటి నుంచి వైరస్‌తో సహవాసం చేస్తున్నారు. దేశంలోనే తొలిసారి ఇక్కడి ల్యాబ్‌లో కృత్రిమ వైరస్‌ను పెంచారు. కొవిడ్‌ మందులు, టీకాలు వైరస్‌పై ప్రభావం చూపుతున్నాయో లేదో పరీక్షించడం ప్రారంభించారు. కాలం గడిచేకొద్దీ వైరస్‌లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఆయా రకాలను, ఉత్పరివర్తనాలను నిత్యం గమనిస్తూ, పరిశోధనలు కొనసాగిస్తున్నారు. చౌక ధరలో, సులభంగా చేసే డ్రైస్వాబ్‌ కొవిడ్‌ కిట్లను అభివృద్ధి చేశారు. మొత్తం 200 మందికి పైగా శాస్త్రవేత్తలు, పరిశోధక విద్యార్థులు, ఇతర సిబ్బంది షిప్టులవారీగా వేర్వేరు బృందాల్లో పనిచేస్తున్నారు.

వైరస్‌లో మార్పులపై నిఘా

వైరస్‌ మనదేశంలోకి ప్రవేశించిన తొలినాళ్ల నుంచే జన్యుక్రమ ఆవిష్కరణ ప్రక్రియ మొదలైంది. గత ఏడాది మార్చి ఆఖరులో ప్రారంభించాం. తొలుత పరిశోధక విద్యార్థుల్లో స్వచ్ఛందంగా ముందుకొచ్చినవారితో టెస్టింగ్‌ ఇతరత్రా ప్రక్రియలు కొనసాగించినా.. ఆ తర్వాత ఒక్కో విభాగంలో పదుల సంఖ్యలో పరిశోధనల్లో పాల్గొంటున్నారు. నిర్ధారణ పరీక్షలు, వైరస్‌ను పెంచడం, ఔషధాలు పనిచేస్తున్నాయో లేదో పరీక్షించడం, జన్యుక్రమ ఆవిష్కరణ వరకు నాలుగు రకాల పరిశోధనలు సాగుతున్నాయి. ల్యాబ్‌లోని సగం మంది శాస్త్రవేత్తలు, పరిశోధక విద్యార్థులు పాలుపంచుకుంటున్నారు. -దివ్వతేజ్, యువ శాస్త్రవేత్త, జన్యుక్రమ ఆవిష్కరణ

* అన్నీ పక్కనపెట్టి ఏడాదికిపైగా కొవిడ్‌పైనే దృష్టిపెట్టాం. దేశవ్యాప్తంగా వేర్వేరు రాష్ట్రాల నుంచి వస్తున్న వైరస్‌ నమూనాలను జన్యుక్రమ ఆవిష్కరణ ద్వారా వాటి రకాలు, వస్తున్న మార్పులను అధ్యయనం చేస్తున్నాం. డిసెంబరు వరకు వెయ్యి జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేయగా.. ఇటీవల మరో 1500 వరకు చేశాం.

* దేశవ్యాప్తంగా వస్తున్న నమూనాలను ప్రాసెస్‌ చేసి వారంలో ఒకేసారి 500 వరకు జన్యుక్రమ ఆవిష్కరణ చేపడుతుంటాం. వేగంగా వీటి జన్యుక్రమాన్ని కనుగొని, విశ్లేషించి, బయటి ప్రపంచానికి తెలియజేయాలనే లక్ష్యంతోనే నిరంతరం పనిచేస్తున్నాం. ప్రస్తుతానికి ఇదొక్కటే మా ముందున్న సవాల్‌.

* తొలి దశలో బృందంలో కొందరు వైరస్‌ బారిన పడ్డారు. త్వరగానే కోలుకున్నారు. మా పరిశోధన వైరస్‌ ఆర్‌ఆర్‌ఏపై కాబట్టి పెద్దగా భయపడింది లేదు. అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చాం. ఎంత ప్రమాదమో తెలుసు కాబట్టి బయట ఉన్నా జాగ్రత్తగా ఉంటాం. వైరస్‌ ఏ రకం అన్నది ప్రధానం కాదు.. జాగ్రత్తగా ఉంటే కొవిడ్‌ నుంచి రక్షించుకోవచ్చు.

భయం పోగొట్టేందుకు సమయం పట్టింది

మొదట్లో కొవిడ్‌ వైరస్‌ గురించి ఎవరికీ ఏమీ తెలియదు. మాకూ భయం ఉండేది. ల్యాబ్‌తో సంబంధం లేకపోయినా అప్పట్లో ఇద్దరికి కరోనా సోకడంతో భయం మరింత పెరిగింది. నిజానికి ల్యాబ్‌లో పనిచేయడం సురక్షితం. పకడ్భందీగా రక్షణ చర్యలు తీసుకుంటాం కాబట్టి వైరస్‌ సొకే అవకాశం ఉండదు. బయటికి వెళ్లినా జాగ్రత్తగానే ఉంటాం. బృందంలోని సభ్యులకు ధైర్యం చెబుతూ మరోవైపు ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ నిర్ధారణ పరీక్ష ఫలితాలు వెల్లడించేవాళ్లం. మొదట్లో ఈ రెండే సవాళ్లు ఉండేవి. క్రమంగా వీటిని అధిగమించాం.

-యువ శాస్త్రవేత్త డాక్టర్‌ కార్తీక్‌ భరద్వాజ్, టెస్టింగ్, వైరస్‌ జన్యుక్రమ ఆవిష్కరణ

* తొలి దశలో నిర్ధారణ పరీక్షలకు సంబంధించి అవగాహన తక్కువగా ఉండేది. ప్రభుత్వ, ప్రైవేటు సిబ్బందికి శిక్షణ ఇస్తూ.. పరీక్షలు కొనసాగిస్తూ.. జన్యుక్రమ ఆవిష్కరణలో పాలుపంచుకునేవాళ్లం. మలి దశలో కొందరు రెండోసారి కరోనా బారిన పడినా ధైర్యం కోల్పోకుండా పనిచేస్తున్నాం.

* 14 నెలలుగా ఒక్క రోజు సెలవు తీసుకోలేదు. ప్రస్తుతమున్న అవసరమే మమ్మల్ని నడిపిస్తోంది. నిత్యం 300 వరకు ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలు చేస్తున్నాం. గంటల తరబడి పీపీఈ కిట్లు ధరించడం కొంత అసౌకర్యమే అయినా, పరిశోధనల రీత్యా ఇది అనివార్యం.

* కిట్ల కొరత వేధిస్తున్న సమయంలో తక్కువ ఖర్చుతో, సత్వర ఫలితమిచ్చే డ్రైస్వాబ్‌ కిట్లు ఎంతో ఉపయోగం. వీటితో పాటు సీసీఎంబీ అభివృద్ధి చేసిన ఆటోమెటిక్‌ ఆర్‌ఎన్‌ఏ ఎక్స్‌ట్రాక్షన్‌ నిర్ధారణ పరీక్ష వేగంగా చేసేందుకు ఉపయోగపడుతోంది. ఒకేసారి పదివేల పరీక్షలు చేసే సాంకేతికత అభివృద్ధి చేసినా నమూనాల సేకరణ, ఫలితాల వెల్లడిలో ఆలస్యం జరుగుతోంది. వీటిని కమ్యూనిటీల్లో కొవిడ్‌ వ్యాప్తి ఏ విధంగా తెలుసుకునేందుకు ఉపయోగించుకోవచ్చు.

ఇదీ చూడండి:

వైద్యుడి వినూత్న శైలి : టీ ఆకృతి పైపుతో ఒకేసారి ఇద్దరికి ప్రాణవాయువు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.