అత్యంత సులువైన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కోసమే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశారని.. ఆ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. నాలుగు రకాలుగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ విభజనకు నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. రద్దీగా ఉన్న కార్యాలయంలో ఎక్కువ మంది సిబ్బందిని పెట్టి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగిస్తామని చెప్పారు.
అధికార బృందాలను మూడు విభాగాలుగా విభజన చేపట్టామని.. బిల్డర్లు, స్థిరాస్తి వ్యాపారుల అభిప్రాయాలను తీసుకుంటామని పేర్కొన్నారు. సమస్యలను అధిగమించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ముందుకువెళ్తోందని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: కాళేశ్వరం విస్తరణ పనులపై ఎన్జీటీలో ధిక్కరణ పిటిషన్