ఆంగ్ల మాధ్యమం అంశంలో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరి చేస్తూ వైకాపా సర్కార్ తెచ్చిన జీవోలు 81, 85లను హైకోర్టు ఇటీవల రద్దు చేసిన సంగతి తెలిసిందే. కోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ దేశ సర్వోన్నత న్యాయస్థానం మెట్లు ఎక్కింది ప్రభుత్వం. హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వాలని కోరింది. దీనిపై గురువారం జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం విచారించనుంది.
ఇదీ చదవండి