మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పట్టణంలోని మల్లికార్జున్ నగర్లో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో సురేశ్ అనే వ్యక్తి తన భార్య సంధ్యను హత్యచేశాడు.
పట్టణానికి చెందిన సురేశ్, సంధ్యలు ఏడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. సురేశ్ ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. అయితే భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండడం వల్ల వారం రోజుల క్రితం సంధ్య మల్లికార్జున్‌నగర్‌లోని తన పుట్టింటికి వచ్చింది.
గురువారం రాత్రి అత్తవారింటికి వచ్చిన సురేశ్.. ఇంట్లో ఉన్న గడ్డపారతో సంధ్యను పొడిచాడు. తీవ్ర రక్తస్రావమైన సంధ్య అక్కడికక్కడే చనిపోయింది. అనంతరం సురేశ్ పోలీసులకు లొంగిపోయారు.
ఘటనా స్థలాన్ని బెల్లంపల్లి ఏసీపీ రహమాన్, మందమర్రి సీఐ మహేశ్, రామకృష్ణాపూర్ ఎస్సై రవిప్రసాద్‌లు పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీచూడండి: ప్రేమోన్మాది ఘాతుకం: విద్యార్థిని గొంతు కోసిన ఆటో డ్రైవర్