ETV Bharat / city

హైకోర్టుకు హాజరైన ఎన్టీఆర్‌ వైద్య విశ్వవిద్యాలయం వీసీ, రిజిస్ట్రార్‌

గతేడాది జనవరి 6న జరిగిన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ స్నాతకోత్సవం నిర్వహణకు సంబంధించిన ఖర్చుల బిల్లుల చెల్లింపుపై హైకోర్టులో దాఖలైన వ్యాజ్యంపై విచారణ జరిగింది. గత విచారణలో న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలతో తాజా విచారణకు ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్శిటీ వీసీ, రిజిస్ట్రార్ హాజరయ్యారు. వివాదంలేని రూ.3.55 లక్షలను చెల్లించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని న్యాయస్థానానికి వారు వెల్లడించారు. వాదనలు విన్న న్యాయస్థానం.. తదుపరి విచారణను వాయిదా వేసింది.

హైకోర్టు
హైకోర్టు
author img

By

Published : Apr 19, 2022, 4:26 AM IST

స్నాతకోత్సవం నిర్వహణ సందర్భంగా వేదిక , తదితర ఏర్పాట్ల విషయంలో బిల్లుల చెల్లింపు వివాదంపై ఎన్టీఆర్ వైద్య , ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి (వీసీ) శ్యాంప్రసాద్ , రిజిస్ట్రార్ శంకర్ సోమవారం హైకోర్టుకు హాజరై.. వివరణ ఇచ్చారు. యూనివర్సిటీ తరఫు న్యాయవాది విజయ కుమార్ వాదనలు వినిపిస్తూ .. పిటిషనర్ సమర్పించిన బిల్లులను యూనివర్సిటీ డిప్యూటీ ఇంజనీర్ దురుద్దేశంతో ధ్రువీకరించారన్నారు. వాస్తవానికి స్నాతకోత్సవం జరిగే సమయంలో ఆయన సెలవులో ఉన్నారన్నారు. డిప్యూటీ ఇంజనీర్​కు మెమో జారీచేశామన్నారు. పిటిషనర్ మొత్తం రూ.18 లక్షల బిల్లు కోరుతున్నారని , వివాద రహిత సొమ్ము రూ.3.5 లక్షలు మాత్రమేనని.. దాన్ని చెల్లించేందుకు సిద్ధమని వీసీ కోర్టుకు తెలిపారు.

ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ .. డిప్యూటీ ఇంజనీర్ అవకతవకలకు పాల్పడినట్లయితే మెమో జారీచేసి వదిలేస్తే సరిపోతుందా అని ప్రశ్నించారు. ఎందుకు సస్పెండ్ చేయలేదన్నారు. క్రిమినల్ కేసు పెట్టాలని సూచించారు. వివాద రహిత సొమ్మును పిటిషనర్​కు వారంలో చెల్లించాలని ఆదేశించారు. కౌంటర్ వేయాలని ప్రతివాదులకు నోటీసులు జారీచేశారు. విచారణను జూన్ 14 కు వాయిదా వేశారు.

స్నాతకోత్సవం నిర్వహణకు అయిన ఖర్చుల బిల్లులను చెల్లించడం లేదని పేర్కొంటూ లక్ష్మినరసింహ షామియానా సప్లైయర్స్ యజమాని ఎం.వెంకటేశ్వర్లు హైకోర్టును ఆశ్రయించారు. గతంలో ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయమూర్తి .. వివరణ ఇచ్చేందుకు వీసీ , రిజిస్ట్రార్ హాజరుకు ఆదేశించారు . ఈ నేపథ్యంలో వారు సోమవారం కోర్టుకు హాజరయ్యారు.

ఇదీ చదవండి: అక్కడ వైకాపా కార్యాలయం కట్టినట్లు తేలితే.. కూల్చివేత ఉత్తర్వులు: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.