ETV Bharat / city

25న ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం - రాష్ట్రంలో ఇళ్ల పట్టాల పంపిణీ వార్తలు

ఈ ఏడాది డిసెంబరు 25న మొదటి విడత కింద 15.10 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. వీటిలో వైఎస్సార్‌ జగనన్న కాలనీల కింద కొత్తగా ఏర్పాటు చేసిన లేఅవుట్లలో చేపట్టే ఇళ్లు 11.22 లక్షలు ఉన్నాయి.

HOUSE RAILS
25న ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం
author img

By

Published : Nov 30, 2020, 6:54 AM IST

రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది డిసెంబరు 25న మొదటి విడత కింద 15,10,227 ఇళ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం ప్రారంభించనుంది. వీటిలో వైఎస్సార్‌ జగనన్న కాలనీల కింద కొత్తగా ఏర్పాటు చేసిన లేఅవుట్లలో చేపట్టే ఇళ్లు 11,22,559 ఉన్నాయి. మిగతా 3,87,668 ఇళ్లు వ్యక్తిగత ఇళ్ల స్థలాలున్న వారికి మంజూరు చేయనుంది. వీటిని పురపాలక సంఘాలు, పట్టణాభివృద్ధి సంస్థల్లో (యూడీఏ) చేపట్టనుంది. 1,26,974 మంది లబ్ధిదారుల నుంచి ఇప్పటికే స్థల అనుభవ పత్రాలను (పొజిషన్‌ సర్టిఫికెట్‌) గృహ నిర్మాణశాఖ అధికారులు సేకరించారు. ఇంకా 2,60,974 మంది నుంచి పత్రాలు సేకరించాల్సి ఉంది.

రివర్స్‌ టెండరింగ్‌తో ఇళ్ల నిర్మాణ సామగ్రి సేకరణ

జగనన్న కాలనీల్లో చేపట్టే ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ముడి సరకును ప్రభుత్వమే సమకూరుస్తుంది. ఇసుకను ఉచితంగా సరఫరా చేయాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించింది. సిమెంటును రూ.220 నుంచి రూ.240లోపు ధరలతో సరఫరా చేయాలని స్పష్టం చేసింది. ఇతర సామగ్రిని రివర్స్‌ టెండర్ల ప్రక్రియలో కొనుగోలు చేయనుంది. అవసరమైన వాటికి న్యాయ సమీక్షకు వెళ్లాలని గృహ నిర్మాణశాఖ అధికారులు నిర్ణయించారు. ఇనుము, కిటికీలు, తలుపులు, పెయింట్స్‌, ఎలక్ట్రికల్‌ వస్తువులు, శానిటరీ సామగ్రి తదితరాలకు రాష్ట్ర స్థాయిలో టెండర్లను నిర్వహిస్తారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.