అమరావతి రాజధాని ఉద్యమం 666వ రోజుకు చేరింది. రోజులు, నెలలు, సంవత్సరాలు గడుస్తున్నా.. ఉధృతంగా పోరాటం కొనసాగిస్తున్నారు అన్నదాతలు. తుళ్లూరు, మందడం, వెలగపూడి, అనంతవరం, నెక్కల్లు, పెదపరిమి, మోతడక గ్రామాల్లో రైతులు దీక్షలు కొనసాగిస్తున్నారు.
ఉద్యమం 666వ రోజుకు చేరిన సందర్భంగా.. బోరుపాలెంలోని దీక్షా శిబిరంలో కొలువైన అమ్మవారిని దుర్గామాతగా అలంకరించి పూజలు నిర్వహించారు. ఏకైక రాజధానిగా అమరావతే కొనసాగేలా చూడాలని అమ్మవారిని వేడుకున్నారు.
గుంటూరుకు చెందిన న్యాయవాది చిగురుపాటి రవీంద్రబాబు రచించిన ఉద్యమ పాటల సీడీని జడ్పీ మాజీ ఛైర్ పర్సన్ కూచిపూడి విజయ, మోతడక సర్పంచ్ పార్వతి ఆవిష్కరించారు.
అమరావతి బహుజన ఐకాస రూపొందించిన ఢమరుకం వీడియోను సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు ఆవిష్కరించారు. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే వైకాపా ప్రభుత్వం మూడు రాజధానులను తెరపైకి తీసుకొచ్చిందని రాజకీయ ఐకాస కన్వీనర్ పువ్వాడ సుధాకర్ ధ్వజమెత్తారు.
ఇదీ చదవండి: devineni uma: ఆ ఒప్పందంతో.. రాష్ట్ర రైతుల గొంతు కోశారు: దేవినేని ఉమ