ETV Bharat / city

కేంద్ర పథకాల నిధులకు పక్కా బిగింపు - Central schemes funds news

కేంద్ర పథకాల అమలు కోసం ఇస్తున్న నిధులను ఇష్టమొచ్చినట్లు ఖర్చు చేయడానికి వీల్లేదు. ఆ నిధులను వేరే ఖాతాలకు మళ్లించడం కుదరదు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నిధుల వినియోగ విధానాన్ని సమూలంగా మార్చేసింది. గతేడాది నుంచి అనేక ప్రతిపాదనలతో ప్రయత్నాలు ప్రారంభించినా కొత్త మార్గదర్శకాలు ఈ మధ్యే కొలిక్కి వచ్చాయి. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో ఈ విషయం చర్చించాక ఈ మార్గదర్శకాలను కేంద్రం ఖరారు చేసింది.

central
central
author img

By

Published : Jul 26, 2021, 4:46 AM IST

కేంద్ర ప్రాయోజిత పథకాల అమలు నిమిత్తం కేంద్రం ఇస్తున్న నిధులను ఇక ఇష్టమొచ్చినట్లు ఖర్చు చేయడానికి వీల్లేదు. ఆ నిధులను వేరే ఖాతాలకు, పీడీ ఖాతాలకు మళ్లించడం కుదరదు. కేంద్రం ఏ పథకాలకు ఇస్తే వాటికే ఖర్చుచేయాలి. కేంద్రం నుంచి వచ్చే నిధులను తొలుత వేరే అవసరాలకు వినియోగించుకుని, పీడీ ఖాతాలకు మళ్లించి తర్వాతి ఏడాది ఖర్చుచేయడం ఇకపై కుదరదు. కేంద్రం ఇచ్చిన వాటా నిధులు ఖర్చుచేసి ఆ పథకంలో రాష్ట్ర వాటా తర్వాత చెల్లిస్తామన్నా కుదరదు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నిధుల వినియోగ విధానాన్ని సమూలంగా మార్చేసింది. గతేడాది నుంచి అనేక ప్రతిపాదనలతో ప్రయత్నాలు ప్రారంభించినా కొత్త మార్గదర్శకాలు ఈ మధ్యే కొలిక్కి వచ్చాయి. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో ఈ విషయం చర్చించాక ఈ మార్గదర్శకాలను కేంద్రం ఖరారు చేసింది. కొత్త విధానాల ఏర్పాటుకు అవసరమైన సాంకేతిక, ఇతరత్రా ఏర్పాట్లు చేసి తమకు తెలియజేయాలని కోరింది. రాష్ట్ర ప్రభుత్వాల వల్ల తమ పథకాల అమలు తీరు సరిగా లేదని కేంద్రం భావిస్తోంది. తొలుత రాష్ట్రాలు తమ అవసరాలకు నిధులు వాడుకుని, తర్వాత కేంద్ర పథకాలపై దృష్టి సారిస్తున్నాయనే విమర్శా ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర పథకాల సక్రమ అమలుకు, పారదర్శకంగా ఖర్చు చేయడానికి, లబ్ధిదారులకు అంతిమ ప్రయోజనం సరిగా అందేందుకు వీలుగా ఈ ఏర్పాట్లు
చేస్తున్నట్లు కేంద్రం చెబుతోంది.

సంసిద్ధం కాని రాష్ట్ర ప్రభుత్వం
ఈ కొత్త విధానాన్ని జులై నుంచి ప్రారంభిస్తామని కేంద్రం ప్రకటించింది. ఇప్పటికే ఇందుకు 20 రాష్ట్రాలు సానుకూలత వ్యక్తం చేయగా... ఆంధ్రప్రదేశ్‌ మాత్రం ఇంకా సరేననలేదు. కొత్త విధానంతో ఆర్థిక నిర్వహణలో సమస్యలు తలెత్తుతాయని, ప్రస్తుతం రాష్ట్ర అవసరాలకు వినియోగించుకుంటున్న కేంద్ర నిధులను ఇకముందు అలా ఖర్చుచేసే పరిస్థితులు ఉండవని రాష్ట్ర ఆర్థికశాఖలోనే చర్చనీయాంశమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త విధానం అమలుచేసేలా ఎనిమిది అంశాల్లో ఏర్పాట్లు చేసి తమకు తెలియజేయాలని కేంద్రం కోరింది. ఆర్థికశాఖ అధికారులు బ్యాంకులతో ఇప్పటికే సమావేశం ఏర్పాటుచేసినా చాలా విషయాలు కొలిక్కి రాలేదని సమాచారం. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన 9 పథకాలకు నిధులు ఇలా వినియోగించాలి.

నిధుల రాక... రాష్ట్ర వాటా, నిర్వహణ ఇక పక్కా
కేంద్ర పథకాలకు తన వాటా నిధులను కేంద్రం విడుదల చేస్తుంది. రిజర్వుబ్యాంకులోని రాష్ట్రాల ఖాతాలకు అవి చేరతాయి. ఈ నిధులు చేరిన 21 రోజుల్లోగా రాష్ట్ర ప్రభుత్వాలు ఆ మొత్తాన్ని సింగిల్‌ నోడల్‌ ఏజెన్సీ ఖాతాలకు బదలాయించాలి. కేంద్రం తన వాటా విడుదల చేసిన 40 రోజుల్లోగా రాష్ట్రం తన వాటాను ఆ ఖాతాలకు బదలాయించాలి.

  • ప్రతి కేంద్ర ప్రాయోజిత పథకానికి నోడల్‌ ఏజెన్సీని ఏర్పాటుచేయాలి. వాటి కింద అమలు ఏజెన్సీలు ఉండాలి. వీటితో పాటు లబ్ధిదారుల ఖాతాలనూ పబ్లిక్‌ ఆర్థిక నిర్వహణ వ్యవస్థ పరిధిలోకి తీసుకురావాలి.
  • ఈ నిధులు కేంద్ర పథకం కోసం నిర్దేశించిన సింగిల్‌ నోడల్‌ ఏజెన్సీ ఖాతాలోనే ఉండాలి. ఈ పథకం కింద చెల్లింపులు చేయాల్సిన ఖాతాలకు తప్ప.. వేరే ఎక్కడికీ బదిలీలు ఉండకూడదు. పబ్లిక్‌ ఫైనాన్సు మేనేజిమెంటు వ్యవస్థలో చివరి లబ్ధిదారుడి వరకు ఉన్న అన్ని ఖాతాలు మ్యాపింగ్‌ చేయాలి.
  • ఈ నిధుల నిల్వ, చెల్లింపులు, తదితర కార్యకలాపాలకు రాష్ట్రప్రభుత్వ పబ్లిక్‌ ఫైనాన్సు మేనేజిమెంటు వ్యవస్థ బాధ్యత వహించాలి. ఈ మొత్తాల వడ్డీలను నోడల్‌ ఏజెన్సీ రాష్ట్ర కన్సాలిడేటెడ్‌ నిధికి జమ చేయాలి.
  • రాష్ట్రం తన వాటా నిధులు ఇస్తేనే
  • ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో కేంద్రం 25% లోపు నిధులే ఇస్తుంది. రాష్ట్రం తన వాటా నిధులను కూడా జతచేసి అందులో 75% ఖర్చు చేసిందని ధ్రువీకరించుకున్నాకే మిగిలిన నిధులను కేంద్రం విడుదల చేస్తుంది.
  • ఖర్చు చేయని నిధులను అమలుచేసే ఏజెన్సీలు నోడల్‌ ఏజెన్సీ ఖాతాలకు తిరిగి జమ చేయాలి. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి.

ఇదీ చదవండి

high court: 'భర్తతో సన్నిహితంగా ఉంటున్న వేరే మహిళను విచారించడానికి వీల్లేదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.