ETV Bharat / city

అద్భుత అనుభూతుల సమాహారం.. యాదాద్రి ఆలయం - yadadri temple

ఓ యాత్రకు వెళ్తే...ఓ పర్యటనకు వెళ్తే అది చాలాకాలం గుర్తుండిపోవాలి. వెళ్లి చూసివచ్చినవాటిని తోటివారికి చెబుతుంటే చెప్పేవారి కళ్లల్లో ఓ మెరుపు కనబడాలి. పదేపదే గుర్తుకువచ్చే ఆహ్లాదకర జ్ఞాపకంలా నిలిచిపోవాలి. కాశీయో, మధురమీనాక్షి చెంతకో, కన్యాకుమారికో, శ్రీరంగం, తిరువనంతపురం, తిరుపతి వంటి చోట్లకు వెళితే ఎలాంటి అనుభూతులను జ్ఞాపకాల దొంతర్లలో దాచుకుంటామో అటువంటి అనుభూతుల మనోజాతర సందోహం ఈ యాదాద్రికి కూడా కల్పించారు. పునర్దర్శన ప్రాప్తిరస్తు అని గోడమీద రాయడమే కాదు... ఒకసారి వచ్చినవారికి మళ్లీమళ్లీ రావాలనిపించేంతగా యాదాద్రి పరవశాల జాజర అవ్వాలి. అలా రూపొందిందే నవ్యనిర్మాణాల యాదాద్రి.

yadadri
యాదాద్రి
author img

By

Published : May 20, 2021, 5:11 PM IST

ఐదు రూపాలతో లక్ష్మీనారసింహస్వామి వెలసిన పుణ్యధామం యాదగిరి గుట్ట. యాదగిరి నరసింహుని దర్శనం కోసం వచ్చేవారు … స్వామివారిని దర్శించుకుని , తీర్థప్రసాదాలు తీసుకున్నట్లే...ఎప్పటికీ మరువలేని అనుభూతుల్ని, పరవశాల్ని కూడా జ్ఞాపకాల పొరల్లో పదిలంగా దాచుకుంటారు. యాదగిరిగుట్ట క్షేత్రానికి చేరుకున్న వారు తప్పనిసరిగా యాదమహర్షి తపమాచరించిన పవిత్ర వృక్షాన్ని చూస్తారు. ఆ వృక్షం కింద యాదాద్రి వైపే చూస్తూ తపోభంగిమలో యాదర్షి విగ్రహం ఉంది. విభాండక మహాముని కుమారుడు ఋష్యశృంగుడు - శాంతల కుమారుడే ఈ యాదమహర్షి. ఈ యాదమహర్షి కోరికననుసరించి నరసింహుడు లక్ష్మీసమేతుడై ఈ కొండపై వెలిశాడు. జ్వాలా నరసింహస్వామి, యోగనరసింహస్వామి, గండభేరుండ నరసింహస్వామి ఈ క్షేత్రంలో విగ్రహ రూపంలో దర్శనమిస్తారు. ఐదవ రూపమైన ఉగ్రనరసింహస్వామిగా యాదాద్రి కొండనే భక్తులు భావిస్తారు. ఆ కొండనే యాదమహర్షి చూస్తున్నట్లుగా వృక్షనీడన తపమాచరిస్తూ ఉన్నాడు. ఈ దృశ్యం కనులారా చూసి, మనసునిండా తమ జ్ఞాపకాల పొదిలో దాచుకుంటారు.

ఇలా వెళ్లాలి..

అలనాటి పంచ నారసింహ క్షేత్రం నేటి అంగరంగవైభవాల యాదాద్రిగా పునర్ వైభవాలతో మిరుమిట్లుగొల్పుతోంది. ద్వితీయమో అద్వితీయమో గానీ , యాదాద్రి తిరుపతి మహాక్షేత్రమంతటి వైభవమైంది. విశ్వమంతా విస్మయంతో కనులు విప్పార్చి చూసి, పరవశించేంతగా నూతన కట్టడాల యాదాద్రి నారసింహుని దేవాలయం సిద్ధమైంది. గుహార్భావ స్వామి గుడికి వెళ్లే యాత్ర …జాతరకెళుతున్నంతటి ఉత్సాహభరితంగా ఉంటుంది.. హైదరాబాద్ నుంచి 52 కి.మీ.ల 2గంటల ప్రయాణం మరుపురాని విధంగా ఉంటుంది. హైదరాబాద్‌ వరంగల్‌ జాతీయ రహదారిమీదుగా వెళ్తుండగా ఎడమవైపున ఉన్న యాదాద్రి స్వాగతం ద్వారం స్వాగతిస్తుంది. నేటి ఆధునిక కాలంలోనైతే, బస్సులు, క్యాబ్‌లలో యాదాద్రీశుని వద్దకు వెళుతుంటే ఆ దారిపొడవునా కనిపించే ప్రకృతి అందాలు ఆస్వాదనీయంగా ఉంటాయి. దారిపక్క ఆకుపచ్చటి లాన్‌లు, పురాతన వృక్షాలకు సైతం అద్దిన ఆధునిక హంగులు, సరస్సులు, అభయాంజనేయ అరణ్యం వంటివి కనువిందు చేస్తాయి.

మనోల్లాసం.. మీ సొంతం

యాదగిరిగుట్ట ఊళ్లోకి చేరినట్లు ఎదురుగా కనిపించే కొండ, ఆ కొండవాలుపై తిరునామాలు తెలియజేస్తాయి. అలా ముందుకు వెళ్లగానే వంపులు తిరుగుతూ కొండపైకి దారి కనబడి నిజమే క్షేత్రానికి చేరామనిపిస్తుంది. ఆలయం పరిసరాలలో ఉండే రకరకాల పూజా ద్రవ్యాల దుకాణాలు, వింతవింత బొమ్మల షాపులు , దేవుని దర్శనంతో పాటు బోల్డెంత ఆహ్లాదం సందర్శకుల స్వంతమవుతుంది. అదే ఆనాటి కాలంలో …. ఆ కాలంలోనూ ఆనాటి భక్తజనులకూ మనోల్లాసభరితమైనవి ఉన్నాయి. నేటి కాలంలో సందర్శకుల ఆనందాలకు జెయింట్‌వీల్‌, రంగులరాట్నం వంటివి ఉన్నాయి. ఆనాటి యాత్రీకులకు కూడా మనసులనిండా నిండే అనుభూతులు ఎన్నో.. ఎన్నెన్నో.. నాటికీ నేటికీ గుర్రబగ్గీలు, గుర్రం టాంగాలపై పయనం ఓ మధురానుభూతి.

అనుభూతుల పొదరిల్లు..

ఏడాది పొడవునా ఆరుగాలం కష్టించి... "పంటపండి ఇంటి ముంగిట పుట్లు నిండితే సోమీ... నీ గుడి యాతరకొస్తాను సోవీ “... అని మొక్కుకునే సామాన్య జనానికి ఈ గుర్రపుబండ్లే యాడాదంతా గుర్తుండిపోయే మధురానుభూతి. గుర్రాల అధిరోహణకు, ఈ పంచనారసింహ క్షేత్రానికి ఓ ఆధ్యాత్మిక సంబంధమైన అంశమూ ఇమిడి ఉంది. నృసింహస్వామి ఓంకార క్షేత్రమైన వేంకటగిరి నుంచి అమ్మవారి సహితంగా శ్రీంకార క్షేత్రమైన పాతగుట్టకు వచ్చింది అశ్వంపైననే అని స్థలపురాణం. అక్కడ నుంచి ప్రజల వినతులు వినడానికి స్వామి వారు కూర్చుండే దర్బారు అంటే కొత్తగుట్టకు ఆయనొక్కడే వచ్చిందీ గుర్రాన్నధిరోహించేనంటారు. అందుకు తార్కాణంగా ఆనాటి గుర్రపుడెక్కల గుర్తులు కూడా నేటి భక్తులకు పూజనీయమై ఉన్నాయి. అందుకే ఆనాటి తీర్థయాత్రీకులకే కాదు నేటి యాత్రీకులకూ గుర్రపు బండి సవారీ ఓ అద్భుత అనుభూతుల ఊయల తూగులాట.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.