ఫీజులపై ప్రైవేట్ మెడికల్, దంత వైద్య కళాశాలల సంఘం ప్రకటన విడుదల చేసింది. ఫీజుల నిర్ధరణ శాస్త్రీయంగా లేదన్న కళాశాలల సంఘం...తమ అభ్యర్థన పరిగణనలోకి తీసుకోలేదని తెలిపింది. విధిలేని పరిస్థితుల్లోనే కళాశాలలు పీజీ ప్రవేశాలు నిలిపివేశాయని సంఘం పేర్కొంది. కొన్నింటిని కొవిడ్ ఆస్పత్రులుగా మార్చడంతో చికిత్స సరిగా అందించలేమని...3 నెలలుగా ఆదాయం బాగా తగ్గిందని కళాశాలల సంఘం తెలిపింది.
ఇవీ చదవండి: 'రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌పోస్టుల తొలగింపు.. అవాస్తవం'