ETV Bharat / city

Allu Arjun fans protest at N convention : ఉద్రిక్తతకు దారితీసిన అభిమానం.. ఎన్ కన్వెన్షన్ వద్ద బన్నీ ఫ్యాన్స్ ఆందోళన! - తెలంగాణ వార్తలు

Allu Arjun fans protest at N convention: హైదరాబాద్‌ మాదాపుర్ ఎన్ కన్వెన్షన్ సెంటర్ వద్ద.. సినీ కథానాయకుడు అల్లు అర్జున్​ను కలిసేందుకు వచ్చిన అభిమానులతో ఉద్రిక్తత నెలకొంది. 'పుష్ప' సినిమా ప్రమోషన్‌లో భాగంగా.. చిత్రబృందం అభిమానులతో ఫొటో సెషన్‌ ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి అభిమానులు పెద్దసంఖ్యలో చేరుకున్నారు. అల్లు అర్జున్ రాకపోవడంతో.. ఒక్కసారికి అభిమానులు గేటు వద్దకు చేరుకుని కన్వెన్షన్‌ సెంటర్‌లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది.

Allu Arjun fans protest at N convention
Allu Arjun fans protest at N convention
author img

By

Published : Dec 14, 2021, 11:20 AM IST

Allu Arjun fans protest at N convention : సినీ నటుడు అల్లు అర్జున్‌ను కలిసేందుకు తరలివచ్చిన అభిమానులతో సోమవారం మాదాపూర్‌ ఎన్‌ కన్వెన్షన్‌ వద్ద ఉద్రిక్తత తలెత్తింది. అల్లు అర్జున్‌ను కలిసేందుకు అవకాశం ఇస్తున్నట్లు పుష్ప చిత్ర బృందం నుంచి అభిమానులకు సమాచారం వచ్చింది. అక్కడ ఫొటో దిగేందుకు ఏర్పాట్లు చేశారు. దీంతో సోమవారం సాయంత్రం ఎన్‌.కన్వెన్షన్‌ వద్దకు పెద్ద సంఖ్యలో అభిమానులు చేరారు. భారీ సంఖ్యలో జనం వచ్చినట్టు తెలుసుకున్న అల్లు అర్జున్‌ కార్యక్రమానికి వెళ్లలేదని పోలీసులు తెలిపారు. రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.

పెద్ద ఎత్తున నినాదాలు

Tension prevails at Allu Arjun fans protest : తమ అభిమాన హీరో వస్తాడని అనుకున్న అభిమానులు... నిరుత్సాహానికి గురై పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఒకేసారి ముందుకు నెట్టుకుంటూ వెళ్లటంతో స్వల్ప తొక్కిసలాట జరిగింది. పోలీసులకు లాఠీలకు పని చెప్పి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఎన్‌.కన్వెన్షన్‌లో 500 మందికి అనుమతి తీసుకున్నట్లు మాదాపూర్‌ ఇన్‌స్పెక్టర్‌ రవీంద్రప్రసాద్‌ తెలిపారు. అందుకు భిన్నంగా అక్కడకు 1000-2000 మంది చేరారు. తప్పడు వివరాలతో అనుమతి తీసుకున్న ప్రొడక్షన్‌ మేనేజర్‌పై కేసు నమోదు చేసినట్టు ఇన్‌స్పెక్టర్‌ చెప్పారు.

ప్రీ రిలీజ్‌ వేడుక నిర్వాహకులపైనా..

Case file on Puspa movie pre-release ceremony organizers: నటుడు అల్లు అర్జున్‌ నటించిన ‘పుష్ప’ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుక నిర్వహించిన మైత్రి మూవీ మేకర్స్‌ ప్రతినిధి కిషోర్‌పై జూబ్లీహిల్స్‌ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజశేఖర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. వేడుక నిర్వహణకు మైత్రి మూవీ మేకర్స్‌ పశ్చిమ మండల డీసీపీని అనుమతి కోరింది. 5వేల పాసులు జారీ చేస్తామని, తగినంత ప్రైవేటు సెక్యూరిటీని నియమించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కార్యక్రమాన్ని నిర్వహించడంతో పాటు రాత్రి 10 గంటలలోపు ముగిస్తామని తెలిపారు. ఇందుకు పోలీసులు అనుమతించారు. అయితే ఆదివారం రాత్రి యూసుఫ్‌గూడ పోలీసు బెటాలియన్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించిన ఈ వేడుకకు 15వేల మందికి పైగా సమీకరించారు. ప్రైవేటు భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేయలేదు. దీంతో పరిస్థితి అదుపు తప్పింది. దీనిపై ఎస్సై నరేష్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి స్టోరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బన్నీ స్పందన

Allu arjun tweet on fans inured: ప్రముఖ కథానాయకుడు అల్లు అర్జున్‌తో ఫొటోషూట్‌ ఉందని తెలుసుకొని సోమవారం గీతాఆర్ట్స్‌ కార్యాలయం వద్దకు బన్నీ అభిమానులు భారీగా చేరుకున్నారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా చేశారు. అయితే వారిని నిలువరించే క్రమంలో స్వల్ప లాఠీఛార్జ్‌ జరిగింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. అయితే ఈ సంఘటనపై అల్లు అర్జున్‌ ట్విటర్‌ వేదికగా స్పందించారు.

"నా అభిమానులు ఫ్యాన్స్‌ మీట్‌ ఈవెంట్‌కు వచ్చి గాయపడిన దురదృష్టకర సంఘటన గురించి నాకు తెలిసింది. నా బృందం వ్యక్తిగతంగా ఈ పరిస్థితిని పర్యవేక్షించడంతో పాటు ఎప్పటికప్పుడు నాకు సమాచారం అందిస్తున్నారు. ఇక నుంచి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్త పడతాను. మీరు నాపై చూపిస్తున్న ప్రేమే నా అతి పెద్ద ఆస్తి" అని అల్లు అర్జున్‌ ట్వీట్‌ చేశారు.

ఇదీ చదవండి: ఫ్యాన్స్ పై లాఠీఛార్జ్​.. స్పందించిన బన్నీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.