ETV Bharat / city

Sanitation workers: పారిశుద్ధ్య కార్మికుల సమ్మె తాత్కాలిక విరమణ

Sanitation workers: పారిశుద్ధ్య కార్మికుల సమ్మెను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు కార్మిక సంఘాల ఐకాస కన్వీనర్లు కె.ఉమామహేశ్వరరావు, పి.సుబ్బరాయుడు తెలిపారు. కార్మికుల డిమాండ్లు నెరవేర్చడంపై ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి లిఖితపూర్వక పత్రాలు పంపకపోతే.. భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.

Temporary withdraw of sanitation workers strike in andhra pradesh
పారిశుద్ధ్య కార్మికుల సమ్మె తాత్కాలిక విరమణ
author img

By

Published : Jul 16, 2022, 8:56 AM IST

Sanitation workers: పారిశుద్ధ్య కార్మికుల సమ్మెను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు కార్మిక సంఘాల ఐకాస కన్వీనర్లు కె.ఉమామహేశ్వరరావు, పి.సుబ్బరాయుడు తెలిపారు. కార్మికుల డిమాండ్లు నెరవేర్చడంపై ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి లిఖితపూర్వక పత్రాలు శని, ఆదివారాల్లోగా పంపకపోతే.. సోమవారం మరోసారి చర్చించి భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. ‘కార్మికులకు ఆరోగ్య భత్యం రూ.6వేలు, జీతం రూ.15వేలతో కలిపి మొత్తం రూ.21వేలు చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించడం సానుకూలమే.

అయినా, కార్మిక సంఘాలను చర్చలకు పిలవకుండా మంత్రి ఏకపక్షంగా ప్రకటించడం సంప్రదాయాలకు విరుద్ధం. ఈ నెల 11న మంత్రులతో జరిగిన చర్చల్లో కార్మికుల సంక్షేమంతో పాటు నైపుణ్య, నైపుణ్యేతర జీతాల అంశాలూ ప్రస్తావనకు వచ్చాయి. ఎన్‌ఎంఆర్‌ల సమస్యలపైనా చర్చించారు. జీవో 6 ప్రకారం జీతం, కరవు భత్యం ఇవ్వడానికి సానుకూలంగా స్పందించారు. ఆర్జిత సెలవు, హెల్త్‌కార్డులు, జీపీఎఫ్‌ ఖాతాలు, విశ్రాంత ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలపైనా చర్చ జరిగింది.

వీటి అమలుపై ప్రభుత్వం నుంచి లిఖితపూర్వకంగా హామీ ఇవ్వకపోతే సమస్య మళ్లీ మొదటికొచ్చే అవకాశం ఉంది. శనివారం ఉదయం నుంచి కార్మికులు పూర్తి స్థాయిలో విధులకు హాజరవుతారు. లిఖితపూర్వక హామీ ఇవ్వడంలో తాత్సారం చేస్తే సోమవారం తర్వాత మరోసారి సమ్మెకు వెళ్లే విషయాన్ని పరిశీలిస్తాం’ అని ఉమామహేశ్వరరావు, సుబ్బరాయుడు అన్నారు.

ఆరోగ్య భత్యం కార్మికులందరికీ వర్తింపజేయాలి.. ‘పార్కుల్లో, భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ (యూజీడీ), మలేరియా విభాగంలో పనిచేస్తున్న కార్మికులకూ రూ.6 వేల ఆరోగ్యభత్యం చెల్లించాలి. నగర పంచాయతీల్లో, విలీన గ్రామాల్లో పని చేస్తున్న కార్మికులకు పురపాలక సంఘాల్లో ఇస్తున్న తరహాలోనే రూ.21 వేల వేతనాలివ్వాలి.

ప్రస్తుతం వీరికి రూ.10-12 వేలే చెల్లిస్తున్నారు. ఔట్‌సోర్సింగ్‌ కార్పొరేషన్‌ (ఆప్కాస్‌) నుంచి తొలగించిన 4వేల మందికి న్యాయం చేయాలి. ఆప్కాస్‌లో చేర్చని వెయ్యిమంది కార్మికుల పేర్లు వెంటనే నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలి’ అని ఉమామహేశ్వరరావు, సుబ్బరాయుడు ప్రభుత్వాన్ని డిమాండు చేశారు.

సమ్మెను విచ్ఛిన్నం చేసే ప్రయత్నం.. ‘సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి ప్రభుత్వం చివరి వరకూ తీవ్రంగా యత్నించింది. కార్మిక సంఘాలతో ఇలా వ్యవహరించడం సరైంది కాదు. 80% కార్మికులు ఇప్పటికీ సమ్మెలో ఉన్నారు’ అని ఐకాస నేతలు అన్నారు. సమావేశంలో నాయకులు కిర్ల కృష్ణమూర్తి, కృష్ణారావు, మధుబాబు, శంకరరావు, రంగనాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: గోదావరి మహోగ్రరూపం.. ముంపు బారిన 279 గ్రామాలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.